ఎన్నో త్యాగలఫలితం స్వతంత్రభారతం
మరిపెడ, ఆగష్టు 12(జనంసాక్షి ):ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే నేటి స్వాతంత్ర భారతమాని డోర్నకల్ శాసనసభ్యులు డీ ఎస్ రెడ్యానాయక్ అన్నారు. 75 వసంతాల స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా సీఐ ఎన్ సాగర్ ఆధ్వర్యంలో గురువారం పట్టణ కేంద్రంలో నిర్వహించిన ఫ్రీడమ్ రన్ కార్యక్రమం లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు తో కలసి ముఖ్య అతిథిగా పాల్గొన్న డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఏడు పదుల వయసులోనూ యువతతో కలిసి 2కె రన్ లో ఉత్సాహంగా పరిగెత్తారు. అదేవిధంగా వివిధ పాఠశాలల విద్యార్థులు 50 అడుగుల జాతీయ పతాకాన్ని చేత పట్టుకొని 2కిమి పరిగెత్తడం జాతీయ భావానికి అద్దం పట్టింది.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ దేశం మొత్తం వజ్రరోత్సవాలాను ఉత్సవంగా జరుపుకోవడం అభినందనియమ్మన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపిపి గుగులోతు అరుణ రాంబాబు నాయక్, జడ్పీటీసీ తేజావత్ శారధా రవీందర్ నాయక్, మున్సిపల్ వైస్ చైర్మన్ ముదిరెడ్డి బుచ్చిరెడ్డి, ఓడిసి ఎమ్మెస్ మాజీ చైర్మన్ కుడితి మహేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ గుగులోతు వెంకన్న, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు తాళ్లపెల్లి శ్రీనివాస్, తహశీల్దార్ రాంప్రసాద్, రెవెన్యూ సిబ్బంది, ఎంపిడిఓ కేలోతు ధన్సింగ్, కార్యదర్శులు, కమిషనర్ సత్యనారాయణరెడ్డి, మున్సిపల్ సిబ్బంది, ఎస్ ఐలు దూలం పవన్ కుమార్, సంతోష్, ఝాన్సీ, పోలీస్ సిబ్బంది, పట్టణ అధ్యక్షుడు ఉప్పల నాగేశ్వరరావు, అయూబ్ పాషా,సర్పంచ్ లపోరం అధ్యక్షులు తాళపల్లి శ్రీను,మండల ఎంపీటీసీ ఫోరమ్ అధ్యక్షుడు తాళ్లపెళ్లి రఘు, తెరాసా పట్టణ ఉపాధ్యక్షుడు ఏ.వెంకట్‌రెడ్డి, వార్డు కౌన్సిలర్లు బానోత్ శ్రీను, రేఖ లలితా వెంకటేశ్వర్లు, మాచర్ల స్రవంతి భద్రయ్య,పానుగోతు సుజాత వెంకన్న, బోడ పద్మకోటేష్ , ఊరుగొండ శ్రీనివాస్, బానోత్ కిషన్, వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి, బానోత్ హతిరాం, ఎడెళ్లి పరశురాములు, బయ్య భిక్షం, కౌసళ్యా గణేష్, షేక్ మక్సూద్, షేక్ ఖైరున్ హుస్సేన్, దేవరశెట్టి లక్ష్మినారాయణ, సర్పంచ్ హరి, ప్రధాన కార్యదర్శి సుమంత్, కృష్ణా, తెరాసా నాయకులు దిగజర్ల ముఖేష్, అజ్మీరా రెడ్డి, వీరారం పార్టీ అధ్యక్షుడు మునేష్, తెరాసా పట్టణ మైనార్టీ అధ్యక్షుడు లతీఫ్, కార్యదర్శి యాకుబ్ పాషా, మండల యువజన అధ్యక్షుడు భరత్, పట్టణ యువజన అధ్యక్షుడు ఉప్పల సతీష్, మహిపాల్ రెడ్డి ఆయా గ్రామాల సర్పంచ్ లు, ఎంపిటిలు, కోప్షన్ సభ్యులు, అధికారులు, యువత, విద్యార్థులు, నాయకులు, కార్యకర్తలు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.