ఎన్‌ఎఫ్‌టీఈ, బీఎన్‌ఎన్‌ఎల్‌ ఆధ్వర్యంలో మేడే

ఆదిలాబాద్‌ సాంసృతికం, జనంసాక్షి: అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని ఆదిలాబాద్‌ ఎన్‌ఎఫ్‌టీఈయూ, బీఎన్‌ఎన్‌ఎల్‌ తమ సంఘ భవనంలో ఘనంగా నిర్వహించారు. జెండాను ఆవిష్కరించిన అనంతరం జిల్లా కార్యదర్శి విలాన్‌ మాట్లాడుతూ కార్మికుల న్యాయమైన పోరాటంలో ముందుంటామని, వారి అభివృధ్దికి ఎల్లవేళల పాటుపడతామని తెలిపారు. సభ్యులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి తమ సంఘం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.