ఎన్‌కౌంటర్లు హింసను ప్రేరేపిస్తాయి
వరంగల్ ఉప ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతివ్వం
సెప్టెంబర్ 17న విలీన దినోత్సవంగా జరపండి
ప్రొఫెసర్ కోదండరాం
ఖమ్మం,సెప్టెంబర్16(జనంసాక్షి):
ఎన్‌కౌంటర్లు హింసను ప్రేరేపిస్తాయని, వరంగల్ లోక్ సభ ఉప ఎన్నిక విషయంలో తెలంగాణ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ కీలకమైన ప్రకటన చేశారు. వరంగల్ ఉపఎన్నికకు జేఏసీ దూరంగా ఉంటుందని తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ప్రకటించారు. అక్కడ పోటీ విషయంలో జెఎసి దూరంగా ఉంటుందని ఆయన అన్నారు.జెఎసి ఇకపై ఏ ఎన్నికలతోను సంబందం ఉండదని ఆయన అన్నారు.ఉప ఎన్నిక లో ఏదో ఒక పార్టీకి ప్రచారం ఇష్టం లేకనే కోదండరామ్ ఈ ప్రకటన చేసి ఉంటారన్న అబిప్రాయం కలుగుతుంది. బుధవారం విూడియాతో మాట్లాడుతూ ఇక నుంచి తమకు ఏ ఎన్నికలతోనూ సంబంధం లేదని తెలిపారు. జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ విలీన దినోత్సవం నిర్వహించనున్నట్లు కోదండరాం వెల్లడించారు. రాచరిక పాలన అంతానికి గుర్తుగా సెప్టెంబర్ 17ను తెలంగాణ విలీన దినోత్సవంగా పాటిస్తామని కోదండరాం తెలిపారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరారు. ఐకాస తరపున రైతు భరోసా కార్యక్రమం చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా యువత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆయన అన్నారు.దేశంలో విదర్భ తర్వాత తెలంగాణలోనే అత్యధికంగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. రైతుల రుణాలు పూర్తిగా మాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా తెంలగాణలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతుండడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.రైతుల రుణాలను పూర్తిగా మాఫీ చేయవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు.తెలంగాణ జెఎసి విమోచన దినోత్సవం నిర్వహిస్తుందని ఆయన చెప్పారు.ఎన్ కౌంటర్లు హింసకు దారి తీస్తాయని ఆయన హెచ్చరించారు.