ఎన్‌కౌంటర్‌లు లేని తెలంగాణ కావాలి
– అరెస్టులను ఖండించిన అల్లం నారాయణ
హైదరాబాద్,సెప్టెంబర్30(జనంసాక్షి): తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న తెలంగాణ ప్రజాస్వామ్య వేదిక ఉద్యమకారుల అరెస్టులను ఖండిస్తున్నట్లు రాష్ట్ర ప్రెస్ అకాడవిూ చైర్మన్ అల్లం నారాయణ పేర్కొన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… ఎన్‌కౌంటర్లు లేని తెలంగాణ కోసం అందరూ ఎదురుచూస్తున్నారన్నారు. అయితే… రాష్ట్రంలో మంగళ, బుధవారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజాస్వామ్య వేదిక ఉద్యమకారులను పోలీసులు అరెస్టు చేశారని, దీనిని తాను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.