ఎన్‌పీఏలో ఐపీఎస్‌ల పాసింగ్‌ఔట్ పరేడ్
హైదరాబాద్: నగరంలోని జాతీయ పోలీస్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్‌ల పాసింగ్ ఔట్ పరేడ్ కార్యక్రమం నేడు జరుగుతుంది. సర్దార్ వల్లభాయ్‌పటేల్ జాతీయ పోలీసు అకాడమీలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ హాజరయ్యారు. శిక్షణ పూర్తిచేసుకున్న 68వ బ్యాచ్ ట్రైనీ ఐపీఎస్‌ల నుంచి అరుణ్‌జైట్లీ ఈ సందర్భంగా గౌరవ వందనం స్వీకరించారు. పలు రాష్ర్టాలకు చెందిన 109 మంది ఐపీఎస్‌లు శిక్షణ పూర్తిచేసుకున్నారు.