ఎన్.హెచ్.ఎం. డీఈవోల జీతాల పెంపును కోరుతూ మిషన్ డైరెక్టర్ కార్యాలయం ముందు ధర్నా

 

వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 11(జనం సాక్షి)

 

నేషనల్ హెల్త్ మిషన్ స్కీములో గత అనేక సంవత్సరాలుగా అతి తక్కువ జీతాలతో పనిచేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్ ల కు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర అధ్యక్షుడు ఎం. నర్సింహ్మ , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామా రాజేష్ ఖన్నా తెలియజేశారు
నేడు కోఠీలోని ఎన్.హెచ్.ఎం. మిషన్ డైరెక్టర్ కార్యాలయం ముందు నిరసన ధర్నా నిర్వహించి అనంతరం అధికారులకు మెమోరాండం అందజేశారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్ లలో దాదాపు మూడు వందల మంది సిబ్బంది ఔట్సోర్సింగ్ విధానంలో డేటా ఎంట్రీ ఆపరేటర్లు గా డిగ్రీ అనంతరం పీజీడీసీఏ కోర్సు చేసి జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా నియామకమైనట్వంటీ సిబ్బందికి కేవలం రూ. 15000/- మాత్రమే చెల్లిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 60 ప్రకారం రూ. 22750 రావాల్సి ఉన్నప్పటికీ గత అనేక సందర్భాలుగా వీరి సమస్యలపై అధికారులకు ఎన్ని పర్యాయాలు విన్నవించినా పరిష్కారం కావడం లేదని వారు విమర్శించారు.
ప్రైమరీ హెల్త్ సెంటర్లలో ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని రకాల పనులు వీరి ద్వారా చేయించుకుంటున్న అటువంటి అధికారులు జీతాల పెంపుదల విషయంలో మాత్రం శ్రద్ధ వహించడం లేదని వారు తెలియజేశారు.
నేషనల్ హెల్త్ మిషన్ అధికారులు వెంటనే చొరవ తీసుకొని జీతాలు పెంచనిచో సమ్మెతో సహా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వారు వివరించారు.
అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని మిషన్ డైరెక్టర్ కార్యాలయంలో అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డీఈవో యూనియన్ ప్రతినిధులు కోటేశ్వర్, శివనాగరాజు ,వేణుగోపాల్ ,రంజిత్ తదితరులు పాల్గొన్నారు.