ఎపిలో అధికార దోబూచులాట

టిడిపిలో తిరుగలేని నేత చంద్రబాబు
ఆయన మళ్లీ సిఎం అంటున్న టిడిపి శ్రేణులు
జగన్‌ సిఎం కావడం ఖాయమంటున్న వైకాపా
అమరావతి,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి):  ఎన్నికల తరవాత కూడా తెలుగుదేశం పార్టీలో జోష్‌ తగ్గడం లేదు. ఓటింగ్‌ సరళి చూసిన తరవాత ఫలితాలు తమకేఅనుకూలంగా ఉన్నాయన్న భరోసాలో పార్టీ అధినేతతో పాటు, పార్టీ శ్రేణులు కూడా ఉన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడడానికి మరో నెల రోజులు పడుతుంది. ఆ తరవాత వెంటనే పార్టీ మహానాడు రానుంది.  ప్రధానంగా నిరుద్యోగభృతి, ఉద్యోగాల కల్పన, పసుపు కుంఉకు, నఅ/-నదాత సుఖీభవ లాంటి కార్యక్రమాలు మళ్లీ టిడిపిని నిలలెబెట్టాయన్న దీమా కనిపిస్తోంది.  మరోవైపు చంద్రబాబు తనయుడు లోకేశ్‌ కూడా యువతను ఆకట్టుకునేలా ప్రకటనలు, ప్రసంగాలు చేసారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 13 ఏళ్ల తరువాత 1995లో తొలిసారి చంద్రబాబు నాయుడు పార్టీ అధ్యక్షుడయ్యారు. వరుసగా ఆయనే అధ్యక్షుడయ్యారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో టీడీపీని జాతీయ పార్టీగా ప్రకటించాక హైదరాబాద్‌లో జరిగిన మహానాడులో ఆయన పార్టీ జాతీయ అధ్యక్షుడయ్యారు.  తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు సారథిగా ఎన్నికవడంతో పార్టీలో ఆయనే తిరుగలేని నేతగా ఉన్నారు. ఎన్టీఆర్‌ లాగా కాకుండా ముందే తన తనయుడిని రంగంలోకి దింపడంతో ఇప్పుడు  చంద్రబాబు తరవాత లోకేశ్‌ అన్న భావన ఏర్పడింది. విభజన తరవాత బాబు పట్టువిడవకుండా ఎపి అభిశృద్దికి కృషి చేయడం కూడా బాగా కలసి వచ్చిందన్న భావన మంత్రుల్లో ఉంది.  ఓ రకంగా  తాత్కాలిక సచివాలయం పూర్తి
చేసుకుని పాలన సొంతగడ్డపై నుంచి ప్రారంభం కావడంతో ఎపిలో నవశకానికి బీజం పడింది. చంద్రబాబునాయుడు పట్టుబట్టి పాలనను ఎపికి మరలించడంతో పాలనా రంగాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. అమరావతి నిర్మాణ కార్యక్రమాలతో ప్రజల్లో నమ్మకం కలిగించారు.  హైదరాబాద్‌ నుంచి కార్యకలాపాలు నడపాలనుకుంటున్న విపక్ష వైకాపాకు ఓ రకంగా గడ్డు పరిస్థితి కల్పించారు. చంద్రబాబు తన మకాంను ఎప్పుడో విజయవాడకు మార్చారు. టిడిపి కార్యాలయాన్ని గుంటూరుకు షిఫ్ట్‌ చేశారు. దీంతో ఎపిలో బలమైన నేతగా నిలబడ్డారు. ప్రజల కూడా తమకు అందుబాటులోనే పాలకులు ఉండాలని కోరకుంటున్నారు. ప్రజలకు ఏనాడు హైదరాబద్‌ వేదికాగా పాలన సాగాలని కోరుకోవడం లేదు. ఇది గమనించే బాబు శరవేగంగా వెలగపూడి నుంచి కార్యాచరణకు దిగారు. జాతీయ పార్టీల పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటుంది.  బిజెపి, కాంగ్రెస్‌లో విజయవాడ కేంద్రంగానే కార్యకలాపాలు సాగిస్తున్నాయి. అలాగే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక బలమైన నేతగా ఎదిగారు. ఆయన తీసుకుంటున్న చర్యల కారణంగా ఎపిలో మరింత బలోపేతం అవుతున్నారు. బాబుకు  ప్రత్యామ్నాయం అని చెప్పగల నాయకుడు కనిపించడం లేదు. ప్రతిపక్షనేత జగన్మోహన్‌ రెడ్డికి ఒకవర్గం ప్రజలలో ఆదరణ ఉన్నప్పటికీ విపక్షనేతగా రాణించలేకపోయారు. నిర్మాణాత్మక విపక్ష ¬దా కన్నా జగన్‌ ఎక్కువగా అధికార పార్టీని విమర్శించడమే పనిగా రాజకీయాలు నెరిపారు. ఏ పని చేసినా విమర్శించడం వల్ల ప్రజలు అంగీకరించడం లేదు. అయితే ఈ ఎన్‌ఇనకల్లో తామేగెలుస్తామన్న ధీమాలో వైకాపా నేతలు కూడా ఉన్నారు. తదుపరి సిఎం జగన్‌ అన్నప్రచారం సాగుతోంది. అందుకే చంద్రబాబు ఏ విషయంపైనా సవిూక్ష చేసినా విమర్శలు చేస్తున్నారు.   కాంగ్రెస్‌లో ఎందరో నాయకులు ఉన్నప్పటికీ వారెవ్వరికీ ప్రజలలో ఆదరణ లేదు. విభజన పాపం వీరిని ఇంకా వెన్నాడుతూనే ఉంది.  ఎంతోకాలం నుంచీ కలగా మారిన పోలవరం  ప్రాజెక్టును పూర్తిచేస్తానని మాట ఇచ్చారు. వచ్చే ఏడాదికి నీళ్లు తీసుకువస్తానన్నారు.