ఎపి ఆర్థిక పరిస్థితి మరీ అధ్వాన్నం
రాష్టాన్న్రి చక్కబెట్టడంలో జగన్ విఫలం
మండిపడ్డ బిజెపి నేతలు
విజయవాడ,ఆగస్ట్21 (జనంసాక్షి):ఏపీ విభజన జరిగాక రాష్టాన్రికి దిశ, దశ లేకుండా పోయిందని బిజెపి నేత విష్ణువర్దన్ రెడ్డి అన్నారు. 13 ఉమ్మడి జిల్లాల్లో ఉన్న వనరులు, సముద్ర తీర ప్రాంతాలను వినియోగించు కోవాలన్నారు. ఏపీని పాలించిన గత, ప్రస్తుత పాలకులు అంచనాలు చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. రాష్ట్ర ఆర్ధిక ప్రగతిని సరైన మార్గంలో తీసుకెళ్లలేదని, అనవసర అంశాలను ప్రస్తావిస్తూ
రాష్ట్ర అభివృద్ధి లేకుండా చేశారని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఏపీని ఆదుకునేందుకు మోదీ నిధులు ఇచ్చారని బీజేపీ నేత అన్నారు. ఏ రాష్టాన్రికి ఇవ్వనన్ని నిధులు ఏపీకి ఇచ్చారని తెలిపారు. లోటు బడ్జెట్ కారణంగా ఏపీ నుంచి కేంద్రానికి వెళ్తుంది తక్కువే అన్నారు. ప్రత్యేక ప్యాకేజీ ద్వారా వేల కోట్ల రుణాన్ని కేంద్రం చెల్లించేలా అంగీకారం ఉందని తెలిపారు. ఏపీకి కేంద్ర నిధులపై ప్రాంతీయ పార్టీలు చర్చకు రావాలని పిలుపునిచ్చారు. ఏపీకి ఇస్తున్న ప్రతి రూపాయిని గణాంకాలతో సహా వివరిస్తామని ఫేర్కొన్నారు. ఏపీలో ఆర్థిక సంక్షోభం నెలకొందని తెలిపారు. బడ్జెట్ ఎలా రూపొందించాలో కేంద్ర బడ్జెట్‌ను చూడాలని.. ఎలా రూపొందించ కూడదో తెలుసుకోవాలంటే.. ఏపీ బడ్జెట్‌ను చూడాలన్నారు. ఆదాయాలు చూసుకోకుండా డబ్బు ఖర్చుపెడితే బాగుపడినవారు లేరన్నారు. అప్పుల భారం మొత్తం రేపు ఏపీ ప్రజలు మోయాల్సిందేనని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చే హావిూలు ఎలా అమలు చేస్తారో.. చెప్పే నిబంధన రావాలన్నారు.