ఎప్పటికైనా సింధుస్వర్ణం సాధిస్తుందన్న గోపీచంద్‌

శంషాబాద్‌ విమానాశ్రయంలో టీమ్‌కు ఘనస్వాగతం

స్వర్ణ లక్ష్యాన్ని విడిచి పెట్టేది లేదన్న సింధు

హైదరాబాద్‌,ఆగస్ట్‌29(జ‌నంసాక్షి): ప్రపంచ ఛాంపియన్స్‌షిప్‌ ఫైనల్లో పీవీ సింధు అద్భుతంగా ఆడిందని ఆమె కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ అన్నారు. ఎప్పటికైనా స్వర్ణపతకం సాధించడం ఖాయమని అన్నారు. సుదీర్ఘంగా సాగిన ఫైనల్లో సింధు స్వర్ణం సాధిస్తుందని అందరూ ఎదురుచూశామని పేర్కొన్నారు. స్వర్ణం సాధించకపోయినా తన ఆటతీరుతో సింధు అందరినీ ఆకట్టుకుందని.. ఆమె ఆడిన ఉత్తమ మ్యాచుల్లో ఇదొకటని అన్నారు. సింధు భవిష్యత్తులో ప్రపంచ ఛాంపియన్స్‌షిప్‌లో తప్పకుండా స్వర్ణం గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచ ఛాంపియన్స్‌షిప్‌లో రజత, కాంస్య పతకాలు సాధించిన సింధు, సైనా, కోచ్‌ గోపీచంద్‌ మంగళవారం హైదరాబాద్‌ చేరుకున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో వారికి అభి మానులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటుచేసిన విూడియా సమావేశంలో సింధు, గోపీచంద్‌ తమ అనుభవాలను విలేకరులతో పంచుకున్నారు. ఈ సందర్బంగా గోపీచంద్‌ మాట్లాడుతూ.. ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఫైనల్స్‌ మ్యాచ్‌ సుదీర్ఘంగా సాగింది. అందులో సింధు అద్భుతంగా ఆడింది. సింధు ఆడిన ఉత్తమ మ్యచ్‌ల్లో ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఇది ఒకటి. సింధు స్వర్ణం సాధిస్తుందని అందరం ఊహించాం. భవిష్యత్‌లో సింధు తప్పకుండా స్వర్ణం సాధిస్తుంది. టోర్నిలో శ్రీకాంత్‌ పతకం సవిూపంలోకి వచ్చాడు. ప్రపంచ బ్యాడ్మింటన్‌లో అందరూ బాగా ఆడారు. సైనా, సింధు, కశ్యప్‌, సాయి, ప్రణవ్‌లు మంచి ఫిట్‌నెస్‌లో ఉన్నారు. 2011 నుంచి స్థిరంగా పతకాలు సాధిస్తునే ఉన్నాం. ఇప్పుడు ఒకే టోర్నమెంట్‌లో 2 పతకాలు సాధించాం. క్రీడలకు ప్రధాని మోదీ అందిస్తున్న ప్రోత్సహం మరువలేనిదని తెలిపారు. గోపీచంద్‌ అకాడవిూలో సింధుకు శాట్స్‌ చైర్మన్‌ వెంకటేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పీవీ సింధును ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ వరల్డ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో గెలుపుకోసం కష్డపడ్డానని తెలిపారు. రజతం గెలవడం సంతోషంగా ఉందన్నారు. వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో ఇప్పటివరకు మూడు పతకాలు గెలిచానని వెల్లడించారు. తల్లిదండ్రులు, కోచ్‌ ప్రోత్సాహంతోనే ఇది సాధ్యమైందని తెలిపారు. వరల్డ్‌ నెంబర్‌-1 కావడమే తన లక్ష్యమని చెప్పారు. ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్షిప్‌ లో రజత పతకం గెలవడం పట్ల తెలుగమ్మాయి పీవీ సింధు సంతోషం వ్యక్తం చేశారు.తన ప్రదర్శన ఎంతో ఆనందాన్ని మిగిల్చిందని పేర్కొన్న సింధు.. ఇదంతా కోచ్‌, తల్లి దండ్రుల సహకారంతోనే సాధ్యమైందని స్పష్టం చేశారు. జపాన్‌ క్రీడాకారిణి ఒకుహరాతో జరిగిన ్గ/నైల్‌ పోరు చాలా కఠినంగా సాగిందని సింధు పేర్కొన్నారు. రజతం గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. ¬రా¬రీగా జరిగిన పోరులో తృటిలో స్వర్ణాన్ని కోల్పోయా. అయినా నా ప్రదర్శన పట్ల చాలా సంతృప్తిగా ఉన్నా. ప్రేక్షకుల నుంచి లభించిన మద్దతు మరువలేనిది. వరల్డ్‌ నంబర్‌ వన్‌ స్థానాన్ని ఆక్రమించడమే లక్ష్యం’ అని సింధు తెలిపారు.ప్రస్తుతం వరల్డ్‌ బ్యాడ్మింటన్‌ ర్యాంకింగ్స్‌ లో సింధు నాల్గో ర్యాంకులో కొనసాగుతున్నారు.