ఎఫ్‌టీఐఐ పదవికి అనుపమ్‌ ఖేర్‌ రాజీనామా

ముంబయి,అక్టోబర్‌31(జ‌నంసాక్షి): ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎఫ్‌టీఐఐ) చైర్మన్‌ పదవికి ప్రముఖ నటుడు అనుపమ్‌ ఖేర్‌ నేడు రాజీనామా చేశారు. తీరిక లేకుండా ఉండటమే తన రాజీనామకు కారణంగా ఆయన లేఖలో పేర్కొన్నారు. రాజీనామా లేఖను కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి రాజ్యవర్థన్‌ సింగ్‌ రాథోడ్‌కు పంపించారు. ఓ ప్రొగ్రాం నిమిత్తం 2018-19 మధ్య కాలంలో యూఎస్‌లో తొమ్మిది నెలలు ఉండాల్సి వస్తుందని తెలిపారు. అనంతరం రానున్న మూడు సంవత్సరాలు

కూడా ఇదే విధంగా ఉండనున్నట్లు వెల్లడించారు. కావునా తన బాధ్యతలకు న్యాయం చేకూర్చలేనందునే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అనుపమ్‌ ఖేర్‌ రాజీనామాను రాథోడ్‌ అంగీకరించారు. ఆయన సేవలకు కృతజ్ఞతలు తెలియజేశారు. అనుపమ్‌ భార్య,ప్రముఖ నటి కిరణ్‌ ఖేర్‌ ఎంపిగా ఉన్నారు.