ఎఫ్‌డీఐలపై రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకోలేదు

కేంద్రమంత్రి ఆనంద్‌శర్మ

సుదీర్ఘచర్చల తర్వాతే నిర్ణయం

వ్యవసాయ ఉత్పత్తుల్లో వృథాను తగ్గించవచ్చు

రాష్ట్రాలపై రుద్దే ఉద్దేశం లేదు

ఢిల్లీ : ఎఫ్‌డీఐలపై అన్ని పక్షాల వాదనలూ విన్నామని, ఈ నిర్ణయం రాత్రికి రాత్రి తీసుకున్నది కాదని కేంద్ర మంత్రి ఆనంద్‌ శర్మ లోస్‌సభకు తెలియజేశారు. ఎఫ్‌డీఐల అంశంపై దేశంలో సంవత్సరాలుగా చర్చ జరుగుతోందన్నారు. దేశంలో వ్యవసాయ అనుబంధ రంగాల్లో తీవ్ర కొరత ఉందని, వ్యవసాయ ఉత్పత్తుల్లో వృథాను బాగా తగ్గించడానికి అవకాశం ఉంటుందని, విదేశీ సంస్థలు భారత్‌లో, మన సంస్థలు విదేశాల్లోనూ అమ్ముకోవచ్చని ఆయన తెలియజేశారు. ఆహార యాజమాన్యం సరిగా లేనందున రైతులు చాలా ఇబ్బందులు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. నిల్వ సౌకర్యం లేక 30-35 శాతం వరకు పండ్లు, కూరగాయలు వృథా అవుతున్నాయన్నారు. రైతు సంఘాలు వినియోగదారుల ఫోరాలు ఎఫ్‌డీఐలను స్వాగతించాయని ఆయన అన్నారు. కేంద్ర నిర్ణయాలను రాష్ట్రాలపై రుద్దే ఉద్దేశం తమకు లేదన్నారు. ఎఫ్‌డీఐలపై అభిప్రాయం చెప్పాల్సిందిగా రాష్ట్రాలను కోరామని, 21 రాష్ట్రాలు అభిప్రాయాలను తెలిపాయని, గుజరాత్‌, పంజాబ్‌ ప్రభుత్వాలు ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం ప్రకటించ లేదన్నారు. పంజాబ్‌, హిమచాల్‌ రాష్ట్రాలు ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదన్నారు. పంజాబ్‌, హిమాచల్‌ రాష్ట్రాలు ఇప్పటీకి లిఖితపూర్వకంగా వ్యతిరేకమని చెప్పలేదన్నారు. దేశ సరిహద్దు రాష్ట్రాలు ఇప్పటికీ లిఖితపూర్వకంగా వ్యతిరేకమని చెప్పలేదన్నారు. దేశ సరిహద్దు రాష్ట్రాల్లో ఎఫ్‌డీఐల ఏర్పాటు పై ప్రధానితో చర్చించామన్నారు. బహుళజాతి సంస్థలు ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోవడానికి అనుమతించమని, ఆ సంస్థల పెట్టుబడులను ఎఫ్‌ఐపీబీ నిరంతరం పర్యవేక్షిస్తుందని కేంద్ర మంత్రి సభకు తెలిపారు. సభలో కేంద్రమంత్రి ప్రసంగం కొనసాగుతోంది.