ఎఫ్‌బీఐ ‘మోస్ట్ వాంటెడ్’ జాబితాలో మహిళ
వాషింగ్టన్ : 1973లో ఒక పోలీసు అధికారిని కాల్చి చంపిన కేసులో 1977లో శిక్ష పడిన జోన్ చెస్సీమర్డ్ అలియాన్ అసాతా పకూర్ (65) అనే మహిళను ఎఫ్‌బీఐ తమ ‘మోస్ట్ వాంటెడ్’ జాబితాలో పొందుపరిచింది. 34 సంవత్సరాల కిందట 1979లో న్యూజెర్సీ జైలు నుంచి తప్పించుకుని క్యూబా పారిపోయిన ఆమె ఆచూకీ తెలిపిన వారికి రూ. 10కోట్ల పారితోషకాన్ని అందిస్తామని ఎఫ్‌బీఐ పేర్కొంది.