ఎమర్జెన్సీ చీకటి రోజులు మళ్లీ రావచ్చు
– భాజాపా సీనియర్ నేత అద్వానీ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ,జూన్18(జనంసాక్షి): బిజెపి సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్‌కె అద్వానీ సంచలన వ్యాక్యలకు కేంద్ర బిందువయ్యారు. అది కూడా ప్రధాని నరేంద్ర మోడీని ఇరుకున పెట్టేలా వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో అత్యవసర పరిస్థితి మళ్లీ రావచ్చునని అద్వాని సంచలన వ్యాఖ్య చేశారు. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆయన ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భారత్‌లో రాజకీయ నాయకత్వం పరిణతి చెందినది కాదని అద్వాని స్పష్టం చేశారు. అయితే ఎమర్జెన్సీ రాదనే నమ్మకం మాత్రం తనకు లేదని అన్నారు. ప్రస్తుత ప్రజాస్వామ్యంలో నిబద్ధత కొరవడిందని ఆయన పేర్కొన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే శక్తులు బలంగా ఉన్నాయన్నారు. ప్రజాస్వామ్యంలో ఉండవలసిన చాలా అంశాలు కన్పించడం లేదన్నారు. ఇందిర హయాంలో అత్యవసర పరిస్థితిని విధించి 40 ఏళ్లు అయిన సందర్భంగా ఆయన ఈ వ్యవఖ్య చేశారు. అయితే అత్యయిక పరిస్థితి విధించడం అంత తేలికైన విషయం కాదుగాని రాదని మాత్రం తనకు నమ్మకం లేదన్నారు. మౌలిక స్వేచ్ఛ, స్వాతంత్య్రాలకు భంగం కలగవచ్చని అద్వాణీ అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యానికి ఉండవలసిన లక్షణాలు ఉండడం లేదని , అందువల్ల ఎప్పుడైనా ఎమర్జన్సీ రావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. తద్వారా మౌలిక స్వేచ్చ,స్వాతంత్రాలకు భంగం కలగవచ్చని అన్నారు. ఎమర్జనీ రావడం అంత తేలిక కాకపోయినా, రాదని చెప్పలేమని అన్నారు. అద్వాని వ్యాఖ్యలు ప్రధాని మోడీ నాయకత్వాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నారా?లేక భవిష్యత్తులో ప్రజస్వామ్య వ్యవస్థ బలపడకపోతే వచ్చే పరిణామాల గురించి ఆందోళన వ్యక్తం చేశారా అన్నది తెలియాల్సి ఉంది.
దేశంలో ఎమర్జెన్సీ వచ్చే అవకాశం లేకపోలేదన్న బిజెపి అగ్రనేత ఎల్‌కే అద్వానీ వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దీనిపై స్పందనలు మొదలయ్యాయి. దిల్లీ
ముఖ్యమంత్రి కేజీవ్రాల్‌తో పాటు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సైతం అద్వానీ వ్యాఖ్యలతో ఏకీభవించారు. ఈ విషయమై ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బిహార్‌లో తాము అనునిత్యం అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంటున్నామన్నారు. ఆయన ఈ విషయం విూద మరింత స్పష్టంగా మాట్లాడలేదు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వంపై దండెత్తారు. భాజపా అధికారంలోకి రాకముందు ఏమేం ప్రమాణాలు చేసిందో వచ్చాక ఏం చేస్తోందో ప్రజలే పరిశీలించాలన్నారు. ఏడాది కాలంలో అవినీతికి తావు లేకుండా పాలించామని ఆ పార్టీ చెప్పుకొంటోందిగాని అవన్నీ ఇప్పుడే మొదలయ్యాయన్నారు. లలిత్ మోదీకి సుష్మాస్వరాజ్ సాయం చేశారన్న ఆరోపణలపై ప్రధాని మౌనం వహించడం ఆ చర్యల్ని అంగీకరించినట్లే అవుతుందన్నారు. ఈ పరిస్థితులను అద్వానీ వ్యాఖ్యలు స్పస్టం చేస్తున్నాయని అన్నారు.