ఎమ్మెల్యేను కలిసిన నూతన సర్పంచులు

అభివృద్దిలో భాగస్వాములు కావాలని హితవు

ఆదిలాబాద్‌,జనవరి28(జ‌నంసాక్షి): రెండు విడతల్లో ఎన్నికైన సర్పంచ్‌లను మాజీమంత్రి, నిర్మల్‌ ఎమ్మెల్యే ఇంద్రకరణ్‌ రెడ్డి అభినందించారు. గ్రామాలకు సేవ చేయడంలో ముందుండాలని, ప్రబుత్వ పథకాలను ప్రజలకు చేర్చాలని సూచించారు.  ఇటీవల ఎన్నికైన కుస్లి, అంజనీతండా, నర్సాపూర్‌(జి) గ్రామాల సర్పంచులు స్వరూప, అంజనబాయి, రాంరెడ్డిలు సోమవారం ఎమ్యెల్యే ఇంద్రకరణ్‌రెడ్డిని నిర్మల్‌లో కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను ఆయా గ్రామల సర్పంచులు సన్మానించారు. తెరాస మండల కన్వీనర్‌ రాజేశ్వర్‌రెడ్డి, భూమేష్‌రెడ్డి, వెంకట్‌రావు, కైలాస్‌, మంగళ్‌నాయక్‌, రాథోడ్‌ శ్రీనివాస్‌, భూమేష్‌ తదితరులున్నారు. అలాగే బోథ్‌ ఎమ్మెల్యే రాఠోడ్‌ బాపురావును తలమడుగు మండలంలోని దేవాపూర్‌ పంచాయతీ సర్పంచి ఫాతిమాబేగం సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన ఆమె ఎమ్మెల్యేను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. పంచాయతీ అభివృద్ధికి కృషి చేయాలని విన్నవించారు. ఆయన సానుకూలంగా స్పందించినట్లు ఆమె చెప్పారు. అబ్దుల్లా, శశికాంత్‌, దత్తాత్రి, సంతోశ్‌ తదితరులున్నారు.