ఎమ్మెల్యేపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు

ఎంపీపీ శ్రీనివావాస్ గౌడ్
బిజినేపల్లి, జనం సాక్షి .సెప్టెంబరు 02 :  నిత్యం ప్రజల మధ్య ఉండి ప్రజా సేవ చేస్తున్న ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని బిజినేపల్లి ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయ న మాట్లాడుతూ 8 ఏళ్లు ఎమ్మెల్వే మర్రి జనార్దన్రెడ్డి నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో చేస్తున్న అభివృద్ధి ద్వారా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించడం ఓర్వలేక ప్రతి పక్షపార్టీల నాయకులు రాజకీయ లబ్ది కోసం తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ప్రతి పక్షపార్టీల నాయకులు ఎన్ని కుట్రలు చేసిన నియోజక వర్గ అభివృద్ధిని, పేద ప్రజలకు ఉచితంగా కార్పోరేట్ స్థాయి విద్యా, వైద్యం అందించడమే లక్ష్యంగా మా నాయకుడు మర్రి జనార్దన్ రెడ్డి పని చేస్తున్నాడని కొనియాడారు. సాధారణ ఎన్నికల సమయంలో సీఎం. కేసీఆర్ను ఒప్పించి అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల కావాలని పట్టుబట్టి సాధిం చుకుంటే ప్రతి పక్షపార్టీ నాయకులు హర్షించక పోగా పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందకుండా కుట్రలు చేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. నాగం జనార్దన్రెడ్డి 30 ఏళ్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా నియోజక వర్గానికి ఏమి చేశావని ప్రశ్నించారు. మెడికల్ కళాశాల కోసం భూసేకరణ చేసి కళాశాల నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించుకునే ముందు దళితుల భూములు లాక్కున్నారని అమాయకులైన దళితులకు లేనిపోని ఆశలు కల్గించి మెడికల్ కళాశాలను అడ్డుకోవాలని చేస్తున్న నీచరాజకీయాలను ప్రజలు గమ “నిస్తున్నారని అన్నారు. నిజంగా దళితులపై చిత్తశుద్ధి ఉంటే నీవు అధికారంలో ఉన్నప్పుడు వారి కోసం ఏమి చేశావని సూటిగా ప్రశ్నిం చారు. మెడికల్ కళాశాల ప్రారంభమైతే నియోజక వర్గంలో ప్రజలంతా మర్రి జనార్దన్ రెడ్డికే మద్దతుగా నిలుస్తారని, కళాశాల ప్రారం దాని అడ్డుకోవాలని చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని రాబోయ్యే ఎన్నికల్లో బుద్ధి చెబుతారని అన్నారు. మచ్చలేని మా నాయకుడు మర్రి జనార్దన్రెడ్డిపై అనవసరంగా తప్పుడు ఆరోపనలు చేస్తే మరో ఉద్యమం మొదలు పెడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ముగ్గం వులేందర్ రెడ్డి, సర్పంచ్లు వంగ సుదర్శన్ గౌడ్, గంగారం ఆశోక్, మస్కూరి అవంతి, చందులాల్, మాన్యానాయక్, లింబ్యానాయక్, నాయకులు మాన్యానాయక్, గోవిందునాయక్, బోజ్యానాయక్, కృష్ణానాయక్, అల్లోజియాదవ్, మల్లేష్ యాదవ్, మాధవరెడ్డి తదితరులు ఉన్నారు.