ఎమ్మెల్యేపై లోకాయుక్తలో ఫిర్యాదు
హైదరాబాద్: ఒక భూ వివాదంలో శేరిలింగంపల్లి శాసనభ్యుడు భిక్షపతి యాదవ్‌పై లోకాయుక్తలో ఫిర్యాదు నమోదైంది. స్థానికంగా ఉన్న నేతాజీ పార్కును స్థానిక ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ ఆక్రమిస్తున్నారని గతంలో బీహెచ్‌ఈఎల్ ఉద్యోగుల సహకార హౌసింగ్ సొసైటీ డైరెక్టర్ ఇంద్రాణి లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని ఎమ్మెల్యే అనుచరలు తన ఇంటిపై దాడిచేశారని, దీనికి కారణమైన ఎమ్మెల్యే సహా ఆయన అనుచరులపై చర్యలు తీసుకోవాలని ఇంద్రాణి కూతురు పూర్ణిమ లోకాయుక్తను ఆశ్రయించారు.