ఎమ్మెల్యేలంతా మాతోనే ఉన్నారు: మధు యాష్కీ

మెజార్టీ లేని బీజేపీ ఏవిధంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుoది

హైదరాబాద్: కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమతో ఉన్నారంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలు అవాస్తవం కాంగ్రెస్ నేత మధు యాష్కీ అన్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలంతా తమతోనే ఉన్నారని స్పష్టం చేశారు. మెజార్టీ లేని బీజేపీ ఏవిధంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ప్రశ్నించారు. మోదీ అప్రజాస్వామిక విధానాలను అన్ని పార్టీలు ప్రశ్నించాలని యాష్కీ అన్నారు.