ఎమ్మెల్యే బానోత్ హరిప్రియకు వినతిపత్రం అందజేత..

 

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారాని కై..

ఇల్లందు జూలై 31 (జనం సాక్షి న్యూస్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
సింగరేణి సంస్థల్లో పనిచేయుచున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు తమ సమస్యల పరిష్కారానికి ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యురాలుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..సింగరేణి యాజమాన్యం తమను శ్రమదోపిడీకి గురి చేస్తూ వారికి ఇప్పటివరకు కూడా ముఖ్యమంత్రివర్యులు కెసిఆర్ తమ జీత భత్యాలలో పెరుగుదల చేయడం లేదని, మా యొక్క సమస్యను ముఖ్యమంత్రి కేసీఆర్కి తెలియజేసే విధంగా వచ్చే నెల ఆగస్టు మూడో తారీకు నుండి జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో మా సమస్యను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకు వెళ్లే విధంగా కృషి చేయాలని ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయకకి కాంట్రాక్ట్ కార్మికుల పరిస్థితిని వివరిస్తూ మాకు తెలంగాణ ప్రభుత్వం వారు ఇస్తున్నటువంటి 60 జీవోను సింగరేణిలో పనిచేయుచున్న ఔట్సోర్సింగ్ కార్మికుల కూడా చెల్లించే విధంగా ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్లే విధంగా ఎమ్మెల్యే హరిప్రియ నాయక్కి కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల పరిరక్షణ సంఘం వారి ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే హరిప్రియ హరి సింగ్ నాయక్ సానుకూలంగా స్పందించి తప్పకుండా ఈ సమస్యను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకు వెళ్లే విధంగా కృషి చేస్తానని తెలియజేశారు… ఈ యొక్క కార్యక్రమంలో సంఘ బాధ్యులు గూడెల్లి యాకయ్య జాటోత్ అనిల్ జయంతు భాష పైన రవి మేకల శ్రీనివాస్ కే పురుషోత్తం చారి లక్ష్మణ్ పూర్ణ జమున కనకధార గంగ రాజేశ్వరి వెంకటేశ్వర్లు సాంబు పూర్ణ మరియు 50 మంది కాంట్రాక్ట్ కార్మిక సోదరి సోదరులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు.

తాజావార్తలు