ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపి సన్మానించిన జ్యువెలర్స్ వర్తక సంఘ సభ్యులు
మెట్ పల్లి వెండి బంగారు వర్తక సంఘ సభ్యులు వైష్ణో దేవి, జమ్మూ కాశ్మీర్ విహారయాత్ర లో భాగంగా ,కాశ్మీర్లో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం అన్నదాన కార్యక్రమం సభ్యులందరికీ నిర్వహించడం జరిగింది. సభ్యులు విహారయాత్ర ముగించుకొని తిరిగి వచ్చిన తర్వాత బుధవారం రోజున మెట్పల్లి పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ను కలిసి మరొకసారి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపి పూలమాల శాలువలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం మెట్ పల్లి వెండి బంగారు వర్తక సంఘం అధ్యక్షులు , కార్యవర్గం మరియు సంఘ సభ్యుల ఆధ్వర్యంలో జరిగింది
ఈ కార్యక్రమం లో అధ్యక్షులు వంగల మహేష్ , జనరల్
సెక్రటరీ తిప్పర్తి వెంకటేష్ , ఉపాధ్యక్షులు బెజ్జరపు నవీన్, కోశాధికారి నాంపల్లి సంజీవ్ ,జాయింట్ సెక్రటరీ
మారోజు సురేష్,
స్వర్ణకార సంఘం సెక్రెటరీ శ్రీరామోజు ప్రవీణ్,
మాజీ స్వర్ణకార సంఘం అధ్యక్షులు,ఎలేశ్వరం వెంకట నరసయ్య,స్వర్ణకార సంఘం ఉపాధ్యక్షులు కలికోట లక్ష్మణ్ ,
స్వర్ణకార సంఘం రాష్ట్ర నాయకులు కృష్ణమాచారి,
బిఆర్ఎస్ నాయకులు గాలిపెల్లి నాగరాజు,కనపర్తి రాజు,తోగిటి సంతోష్, యువ నాయకులు ఇల్లెందుల రాహుల్ , దురిశెట్టి నవీన్ , ఇల్లెందుల రమేష్,రామానుజం,అకోజు శ్రీధర్, నాంపల్లి అరుణ్,తాడూరి రమణయ్య మరియు సంఘ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.