ఎమ్మెల్యే సీతక్క పొరపాటు
యశ్వంత్‌కు బదులుగా ముర్ముకు ఓటు
హైదరాబాద్,జూలై18(జనంసాక్షి): కాంగ్రెస్ ఎమ్మెల్యే సీత అనుకోకుండా తన ఓటును రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు బదులుగా ముర్మకు వేశారు. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు ఓటు వేయబోయి పొరపాటున మొదటి ప్రాధాన్యతా ఓటును బీజేపీ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు వేశారు. విపక్షాల అభ్యర్థి
యశ్వంత్ సిన్హా కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. మొదటి ప్రాధాన్యత ఓటును సీతక్క ముర్మూకు ఓటు వేసుకుంది. ఇంకా బ్యాలెట్ లో సీతక్క ఓటు వేయలేదు. ఆర్వోతో ఆమె డిస్కస్ చేస్తున్నారు. కొత్త బ్యాలెట్ పత్రం కోసం అభ్యర్థిస్తున్నారు. ఫైనల్ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. అయితే సీతక్క పొరపాటున మొదటి ప్రాధాన్యతా ఓటును ముర్మూకి వేశారా? లేదంటే కావాలనే అణగారిన వర్గాలకు చెందిన మహిళ అనే సానుభూతితో ఓటేశారా? అని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఓటు వేసి బయటకు వచ్చిన అనంతరం ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. తను పెన్సిల్ అనుకొని బ్యాలెట్ పైన గీయడంతో మార్కు పడిపోయిందన్నారు. అందుకోసం ప్రత్యేకంగా బ్యాలెట్ పేపర్ ఇవ్వాలని అడిగానన్నారు. కొత్త బ్యాలెట్ పేపర్ ఇవ్వలేదని.. దీంతో మళ్లీ అదే బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేసి వచ్చానని.. ఎన్నికల కమిషన్ ఎలా పరిగణిస్తుందో చూడాలని పేర్కొన్నారు. శాసనసభలోని కమిటీ హాల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో అధికార, విపక్ష పార్టీల ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ఓటువేస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీతక్క వంతు వచ్చింది. ఎన్నికల అధికారులు ఇచ్చిన బ్యాలెట్‌పేపర్‌పై ఎన్డీఏ అభ్యర్థికి టిక్ చేశారు. గ్రహించిన ఆమె తాను పొరపాటున ఓటు వేశానని, మరో బ్యాలెట్ పేపర్ ఇవ్వాలని ప్రిసైడిరగ్ అధికారులను కోరారు. అయితే నిబంధనల ప్రకారం మరో బ్యాలెట్ పేపర్ ఇవ్వలేమని అధికారులు చెప్పారు. అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. బ్యాలెట్ పేపర్‌ను డ్రాప్ బాక్స్‌లో వేయకుండా అక్కడినుంచి వెళ్లిపోయారు. అధికారుల తుది నిర్ణయం కోసం వేచిచూస్తున్నారు.