ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో బాలాజీనాయక్
ఖమ్మం, నవంబర్ 6 : మార్చి 2013లో జరగనున్న ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ పిఆర్‌టియు నుంచి ఖమ్మం రూరల్ మండలానికి చెందిన బాలాజీనాయక్ టిక్కెట్ ఆశిస్తున్నారు. ఇప్పటికే ఈయన సంఘం నాయకులను కలిసి ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని దరఖాస్తు చేసుకున్నారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాలు కలిపి ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఇప్పటికే పిఆర్‌టియు నుండి నల్గొండ జిల్లాకు చెందిన రవీందర్‌ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో తెలంగాణ పిఆర్‌టియు నుంచి అవకాశం కల్పించాలని బాలాజీనాయక్ దరఖాస్తు చేశారు.