ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు నిరసిస్తూ రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి అంతక్రియలు నిర్వహించారు

వీణవంక జూలై 17 (జనం సాక్షి) వీణవంక మండల కేంద్రంలో రాష్ట్రంలో విద్యుత్ సరపరాపై కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ వీణవంక మండల కేంద్రంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మకు సోమవారం మండల కేంద్రంలో పాడే కట్టి శవయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా జమ్మికుంట కరీంనగర్ ప్రధాన రహదారి రోడ్డుపై ర్యాలీ నిర్వహించి అంత్యక్రియలు నిర్వహించారు అనంతరం వీణవంక రైతు వేదిక లో పాల్గొని ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు మూడు పంటలు పండే కరెంటు కావాలి లేకుంటే కాంగ్రెస్ పార్టీ మూడు గంటలు కరెంటు ఇచ్చే పార్టీ కావాలి అని అన్నారు హుజురాబాద్ నియోజకవర్గం లో రైతులు ప్రజలు ఆలోచన చేయాలని అన్నారు కాంగ్రెస్ పార్టీ లాంటి దుష్టశక్తులు ఎన్ని వచ్చిన రైతులకు కాపాడుకునే నాయకుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అని అన్నారు ఇది రైతు రాజ్యం అన్నారు
ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, ఎంపీపీ ముసి పట్ల రేణుక తిరుపతి రెడ్డి,జడ్పీటీసీ మాడ వనమాల సాధవ రెడ్డి ,పిఎసిఎస్ చైర్మన్ మావురపు విజయ్ భాస్కర్ రెడ్డి, వైస్ ఎంపీపీ రాయిశెట్టి లతా శ్రీనివాస్,వీణవంక సర్పంచ్ నీలా కుమార్, మండల సర్పంచ్ల ఫోరమ్ అధ్యక్షులు ఎక్కేటి రఘుపాల్ రెడ్డి నాయకులు గంగాడి తిరుపతి రెడ్డి తో పాటు అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పీఏసీఎస్ డైరెక్టర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.