ఎమ్మెస్సీ (ఫిజిక్స్) విభాగంలో ఫస్ట్ ర్యాంక్ సాధించిన రాజ్ కమల్
సీపీగెట్ ఫలితాల్లో కన్యమ్మ ఫౌండేషన్ విద్యార్థుల ప్రతిభ
సూర్యాపేట (జనంసాక్షి): రాష్ట్రంలోని పలు యూనివర్సిటీలలో పలు పీజీ కోర్సుల నందు ప్రవేశాలకై నిర్వహించిన కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి.ఈ ఫలితాల్లో ఎమ్మెస్సీ (ఫిజిక్స్) విభాగంలో తమ అకాడమీకి చెందిన విద్యార్థి రాజ్ కమల్ ఫస్ట్ ర్యాంక్ సాధించినట్లు కన్యమ్మ ఫౌండేషన్ సభ్యులు , పివిజిఆర్ ఫిజిక్స్ అకాడమీ డైరెక్టర్ డాక్టర్ పవన్ కుమార్ తెలిపారు.కన్యమ్మ ఫౌండేషన్ ఆర్థిక సహాయంతో పీవీజీఆర్ ఫిజిక్స్ అకాడమీ తరఫున విద్యార్థులకు ఎమ్మెస్సీ ఫిజిక్స్ ఎంట్రెన్స్ టెస్ట్ నందు ఉచిత శిక్షణను అందించినట్లు తెలిపారు.తమ అకాడమీ విద్యార్థులు ఎమ్మెస్సీ ( ఫిజిక్స్ )విభాగంలో అత్యుత్తమ ర్యాంకులు సాధించినట్లు తెలిపారు. మొదటి 10 ర్యాంకుల్లో 6 , మొదటి 50 ర్యాంకుల్లో 20 ర్యాంక్ లను తమ అకాడమీ విద్యార్థులు సాధించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ,విద్యార్థులను అభినందించారు.తమ ఫౌండేషన్ విద్యార్థులు దుర్గాప్రసాద్ 6 , అనూష 7 , ధరణి 8 , ఇందు 9 , శ్వేత 10 , వెన్నెల 11 , వర్షిణి 13 , యమున 14 , భాగ్యలక్ష్మి 15 , వనజ 16 , దీపిక 20 , మహేందర్ 24 , ఉమ 27 , గణేష్ 28 , రమాదేవి 32 , రూప 38 , సుప్రజ 39 , యల్లేష్ 42 , స్పందన 46 , ఉమ 48 , మమత 50వ ర్యాంక్ సాధించారని తెలిపారు.అత్యుత్తమ ఫలితాల సాధనకు సహకరించిన ఫౌండేషన్ సభ్యులకు, డాక్టర్ లలిత , లెక్చరర్లు సౌజన్య , స్వాతి , సుస్నేహ, నాగరాజు , స్పందన కాలేజి యాజమాన్యానికి, సాంబశివరావు, డైనమిక్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్, మీర్పెట్ వారికి, లక్ష్మి , శ్రీకాంత్, విద్యార్థుల తల్లిదండ్రులకి, ఆకాష్ తదితరులకు ధన్యవాదాలు తెలిపారు.