ఎయిడ్స్ అంటువ్యాధి కాదు అంటించుకునే వ్యాధి

 

చైల్డ్ ఫండ్ ఇండియా
లింక్ వర్కర్స్ స్కీం ఆధ్వర్యంలో
రఘునాధపాలెం సెప్టెంబర్ 29 జనం సాక్షి మండల కేంద్రంలో వెలుగు కార్యాలయంలో గురువారం నాడు వెలుగు గ్రామ సమైక్య గ్రూప్ సభ్యులకు అవగాహన సదస్సు నిర్వహించారు.

 

ఈ కార్యక్రమంలో చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్స్ డిఆర్పి శివయ్య మాట్లాడుతూ ఎయిడ్స్ అన్నది నాలుగు రకాలుగా సోకుతుందని , సురక్షితం కానీ లైంగిక సంబంధాల వల్ల, రక్త మార్పిడి , కలుషిత సూది ఇంజక్షన్ , హెచ్ఐవి సోకిన తల్లి నుంచి జన్మనిచ్చిన బిడ్డకు ఎయిడ్స్ సోకుతుందన్నారు
ఈ కార్యక్రమంలో వెలుగు ఏపిఎం శారద మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఎయిడ్స్ క్షయ వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండాలని కోరారు
సూపర్ వైజర్ D. నిరోష మాట్లాడుతూ . HIV అనేది అంటువ్యాది కాదు అంటించుకునే వ్యాధి అని, కనుక ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు .

HIV వచ్చినంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం ఇచ్చేమందులు వల
జీవిత కాలాన్ని మరి కొన్ని సంవత్సరాల పాటు
పోడిగించుకోవచ్చు అని ఆమె తెలిపారు.

Hiv సొకినవారికి ప్రభుత్వం తరుపున ఆసరా పింఛను కూడ వస్తుందని ఆమె తెలిపారు

ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రతను పాటించాలని, సీజనల్ వ్యాధులు ప్రభలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
* HIV చాప క్రింద నీరులా విస్తరిస్తున్న కారణంగా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె కోరారు. ప్రతి ఒక్కరూ 18 ఏళ్లు నిండిన వారు ప్రతి ఏటా సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా ఎయిడ్స్ పరీక్షలు చేసుకోవాలని సూచించారు

ఈ కార్యక్రమంలో లింక్ వర్కర్ సూపర్ వైజర్ D. నిరోష గారు, లీంక్ వర్కర్ -ఆవుల నాగమణి గారు, వెలుగు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.