ఎయిరిండియాలోనే ప్రయాణించండి: కేంద్రం

న్యూఢిల్లీ,నవంబర్‌7(జ‌నంసాక్షి): ఉద్యోగులు అధికారిక పర్యటనలకు వెళ్లినప్పుడు ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ అయిన ఎయిరిండియాలో మాత్రమే ప్రయాణించాలని కేంద్ర ¬ంశాఖ తమ సిబ్బందికి సూచించింది. అంతేగాక టికెట్లు కూడా ఎయిరిండియా వెబ్‌సైట్‌ లేదా అధికారిక ట్రావెల్‌ ఏజెంట్‌ సంస్థల నుంచి మాత్రమే కొనుగోలు చేయాలని పేర్కొంది. ధికారిక పర్యటనల ఖర్చును ప్రభుత్వమే భరిస్తున్న నేపథ్యంలో ఎయిరిండియాలో మాత్రమే ప్రయాణించాలనే నియమాన్ని తీసుకొచ్చినట్లు ¬ంశాఖ తెలిపింది. దీని వల్ల ఎయిరిండియాకు కూడా లాభదాయకంగా ఉంటుందని పేర్కొంది. నియమాలను ఉల్లంఘించినవారిపై చర్యలు తప్పవని స్పష్టం చేసింది. ¬ంశాఖ కింద పనిచేస్తున్న ఉద్యోగులందరూ ఈ నియమాన్ని తప్పనిసరిగా పాటించాలని సూచించింది. ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ అయిన ఎయిరిండియా రూ. వేలకోట్ల అప్పుల్లో కూరుకుపోయిన విషయం తెలిసిందే. రుణభారం తగ్గించు కునేందుకు ఎయిరిండియాను ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఇందులో భాగంగా కొన్ని వాటాలను అమ్మేయనుంది. ఇదిలా ఉండగా.. సంస్థ ఆదాయాన్ని పెంచుకునేందుకు కూడా ఎయిరిండియా ప్రయత్నాలు చేపడుతోంది.