ఎయిర్ ఆసియా విమానం తోక లభ్యం

జకార్తా/సింగపూర్: ప్రమాదానికి గురైన ఎయిర్ ఆసియా విమానం వెనుకభాగం(తోక) జావా సముద్రంలో గుర్తించామని ఇండోనేషియా రక్షక, దర్యాప్తు బృందాల అధికారి భంబంగ్ శోలిస్త్యో తెలిపారు. బ్లాక్ బాక్స్‌ను కూడా త్వరలో కనుగొనగలమన్నఆశాభావంవ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలు వివరించే బ్లాక్‌బాక్స్ సాధారణంగా విమానం వెనుక భాగంగా అమరుస్తారు.

11 రోజులుగా జావా సముద్రంలో శకలాలు, మృతదేహాల కోసం అన్వేషిస్తున్నారు. గజ ఈతగాళ్లని అక్కడికే మళ్లీపంపించి ఇతర భాగాల కోసం అన్వేషిస్తామనిచెప్పారు. రెండు కొత్త బలగాల్ని ప్రవేశపెట్టి అన్వేషణ పరిధిని విస్తృతం చేశామని మలేసియా నేవి అధికారి అబ్ధుల్ అజీజ్ జాఫర్ చెప్పారు. 162 మందితో డిసెంబర్ 28న ఇండోనేషియా నుంచి సింగపూర్ వెళుతున్నక్యూజడ్ 8501 విమానం జావా సముద్రంలో కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ 40 మృతదేహాలు గుర్తించారు.