ఎయిర్ కండిషనర్ బహుకరించిన దాతకు సన్మానం
వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 15(జనం సాక్షి)
వరంగల్ నగరంలోని చారిత్రక శ్రీ భద్రకాళి దేవాలయానికి రూపాయలు 1,20,000 విలువగల బ్లోయర్ ఎయిర్ కండిషన్ బహుకరించిన సినీ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్ అధినేత, సినీ నిర్మాత పి వి డి ప్రసాద్ ను శనివారం ఆలయంలో ఘనంగా సన్మానించారు ఆలయానికి వచ్చే భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉండే ఏసీ ని బహూకరించినందుకు ఆలయ ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు, ఆలయ ఈవో శేషు భారతి దృశ్యాలువతో సత్కరించి అభినందించారు. నాగ వంశీ ఉప్పుల శ్రీనివాస్ ద్వారా ఏసీ బహుకరణ జరిగినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ భద్రకాళి దేవాలయ ధర్మకర్త తోనుపునూరి వీరన్న ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
Attachments area