ఎర్ర స్మగ్లర్ల కదలికలపై నజర్‌

వివారాల సేకరిస్తున్న పోలీసులు

చిత్తూరు,జూలై13(జనంసాక్షి): ఎర్రచందనం దుంగలు తరలకుండా గట్టిగా నిఘా పెట్టి, అడవుల్లో కూంబింగ్‌ నిర్వహిస్తున్నా ఎర్రదొంగల ఆగడాలు ఆగడం లేదు. అడపాదడపా పట్టుబడుతున్నా కలపను తరలించుకుని పోతూనే ఉన్నారు. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వారిని అడుగు కదపకుండా చేస్తున్నా కలప ఆగడం లేదు. దీంతో అధికారులకు పాలుపోవడం లేదు. ఇలా ఎర్రచందనం అక్రమ రవాణా ద్వారా భారీగా సంపాదించిన బడా స్మగ్లర్లపై దృష్టి సారిచాల్సి ఉంది. స్థానిక నేతల మద్దతుతోనే వారు రెచ్చిపోతున్నారని పోలీసులు అంటున్నారు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని తలచి ప్రత్యేక బృందాలను నియమించారు. వీరితోపాటు ఏపీలోని రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన స్మగ్లర్లు సైతం ఇందులో ఉన్నారనే పక్కా సమాచారం టాస్క్‌ఫోర్స్‌ వద్ద ఉంది. అటవీప్రాంతంలో ఉన్న బ్యాంకుల్లో నగదు జమచేయడంపై టాస్క్‌ఫోర్స్‌ ఉన్నతాధికారులు దృష్టిపెట్టారు. ఈ మేరకు జిల్లాలో కూడా ఎర్ర స్మగ్లర్ల ఖాతాలపై ఆరా తీస్తున్నారు. ఏజెంట్లుగా ఉన్న వారి కదలికలపైనా ఆరా తీస్తున్నారు.