ఎలిశెట్టిపెల్లి గ్రామ వరద ముంపు బాధితులను సందర్శించిన మండల కాంగ్రెస్ బృందం
ఏటూరునాగారం(జనంసాక్షి)జులై21.
జాతీయ కాంగ్రెస్ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే సీతక్క ఆదేశాలమేరకు, జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ సూచన మేరకు చిటమట రఘు అధ్యక్షతనలో వరద ముంపు, లోతట్టు ప్రాంతలైనా ఎలిశెట్టిపల్లి గ్రామస్థులను సందర్శించిన మండల కాంగ్రెస్ నాయకులు.
ఈ సందర్బంగా మండల అధ్యక్షులు చిటమట రఘు మాట్లాడుతూ గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఏటూరునాగారం మండలంలోని వరద ముంపు, లోతట్టు ప్రాంతాలైనా పలు గ్రామాలను, అందులో భాగంగా ఎలిశెట్టిపల్లి గ్రామాన్ని సందర్శించడం జరిగింది మరి ఇక్కడ గ్రామస్థుల పరిస్థితి ఎలా ఉందంటే గత తొమ్మిదిన్నర సంవత్సరాల నుండి బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంటూ మారుమూల గ్రామాలకు ఎటువంటి అభివృద్ధి జరగలేదని ప్రతిపక్షంగా ఉన్న ఎమ్మెల్యే సీతక్క అభివృద్ధి కోసం అసెంబ్లీలో రోడ్లు బ్రిడ్జిలు రవాణా కోసమని ప్రతిపాదించి మంజూరు చేయిస్తే మళ్లీ ఇదే బిఆర్ఎస్ ప్రభుత్వం ఫారెస్ట్ అధికారులతో అడ్డుపడుతున్నారు. మరి ఇదెక్కడి దిక్కుమాలిన పాలన వ్యవస్థ అని మండిపడ్డారు. మరి ఎలిశెట్టిపెల్లి గ్రామస్తులు పరిస్థితి మరింత దారుణం వాగు కమ్ముతో రవాణా సదుపాయం లేక నిత్యవసర సరుకులు తీసుకొచ్చుకోలేక, సరైన వైద్యం, విద్య,ఉపాధి కల్పనలేక ఆర్థికంగా వెనకబడుతున్నారని ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని అసహనం వ్యక్తం చేశారు. మరి ఎందుకు ఈ బిఆర్ఎస్ ప్రభుత్వానికి మారుమూల ప్రాంతాల పై చిన్నచూపు చూస్తున్నారని, ఇక్కడ ఎటువంటి అభివృద్ధి చేశారని బిఆర్ఎస్ ప్రభుత్వం చెప్పాలన్నారు. ఎలిశెట్టిపెల్లి గ్రామానికి ములుగు ఎమ్మెల్యే సీతక్క బ్రిడ్జ్ 3 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించినప్పటికీ ఫారెస్ట్ అధికారులు మరియు సంబంధిత అధికారులు నిర్లక్ష్యం తోని ప్రజలు ఈ పరిస్థితుల్లో ఉన్నారని అన్నారు. కలెక్టర్ ఎలిశెట్టిపల్లి గ్రామాన్ని సందర్శించినప్పుడు ఉన్నటువంటి బోట్ మరి ఇప్పుడు ఎందుకు లేదన్నారు.గతంలో పులిసే హనుమంతు అనే వ్యక్తి రోడ్డు రవాణా లేక వాగులో పడి చనిపోయారని అన్నారు. ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి దేనికి పూర్తిస్థాయిలో పరిష్కారం లేదని బిఆర్ఎస్ ప్రభుత్వం పై మండిపడ్డారు. రానున్న కాంగ్రెస్ ప్రభుత్వంతోనే రోడ్లు,బ్రిడ్జిలు, ప్రాజెక్టులు నిర్మాణం చేసి ఉజ్వల భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీ చూపెడుతుంది అని అన్నారు. ఇప్పటికైనా వాగు పై పడవను వెంటనే ఏర్పాటు చేయాలని అన్నారు వారానికి సరిపడే నిత్యవసర వస్తువులను వెంటనే అందించాలని కోరారు.అదేవిధంగా వెంటనే బ్రిడ్జి నిర్మాణం చేయాలని, లేకపోతే భూటారం గంటల కుంట నుండి ఎలిసేటిపల్లి గ్రామం వరకు రోడ్డును మంజూరు చేసి నిర్మాణం చేయాలనీ డిమాండ్ చేశారు.ఫారెస్ట్ అధికారులు అడ్డుపడకుండా ప్రభుత్వమే చొరవ తీసుకొని రోడ్డును పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సీనియర్ నాయకులు ఖలీల్ ఖాన్, జిల్లా నాయకులు గుడ్ల దేవేందర్,బ్లాక్ ప్రధాన కార్యదర్శి వావిలాల నర్సింహారావు,మండల ప్రధాన కార్యదర్శి వావిలాల చిన్న ఎల్లయ్య,జిల్లా ఎస్సి సెల్ కార్యదర్శి కొండగొర్ల పోషయ్య,జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి ఎండీ గౌస్,మండల వర్కింగ్ ప్రెసిడెంట్ డోంగిరి మధుబాబు,టౌన్ అధ్యక్షులు ఎండీ సులేమాన్, వర్కింగ్ టౌన్ అధ్యక్షులు సరికొప్పుల శ్రీనివాస్,మండల ఎస్సి సెల్ అధ్యక్షులు కర్నె సత్యం,సర్పంచ్ చింత సుమలత -రమేష్,మండల యూత్ అధ్యక్షులు వసంత శ్రీనివాస్,మండల సహాయ కార్యదర్శి ఈసం జనార్దన్,సోనప కిరణ్,యాఖుబ్ పాషా,అల్లంవారిఘనపురం సర్పంచ్ పలక చిన్నన,కొండగొర్ల మోహన్,సీనియర్ నాయకులు సాధనపెల్లి లక్ష్మయ్య, వార్డ్ సభ్యులు కొండగొర్ల నర్సింహులు, డోంగిరి ప్రకాష్, వాసం రాంబాబు,గ్రామ అధ్యక్షులు పడిదాల సారయ్య,ఆలం నాగరాజు తదితరులు పాల్గొన్నారు.