ఎల్లంపల్లి కింద సాగునీటి విడుదల అసాధ్యం

తాగునీటి అవసరాలకే ప్రాధాన్యం
కరీంనగర్‌,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి లభ్యత మేరకు నిలువ ఉన్న నీటిని ఈ వేసవిలో కేవలం తాగునీటి అవసరాల మేరకే ఉపయోగించనున్నట్లు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు అధికారులు పేర్కొన్నారు.  ప్రస్తుతం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి నిల్వలు తక్కువగా ఉన్న నేపథ్యంలో కరీంనగర్‌ జిల్లాలోని గంగాధర, పెద్దపల్లి జిల్లాలోని మేడారం, వేంనూర్‌ పంప్‌హౌస్‌ల ద్వారా రబీ పంటల సాగుకు నీటిని విడుదల చేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. రైతులు దీనిని పరిగణలోకి తీసుకుని సహకరించా లని కోరారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి వేంనూర్‌, మేడారం, గంగాధర పంప్‌హౌజ్‌ల ద్వారా 2018 ఆగస్టు 12 నుంచి నుంచి 20 18 డిసెంబర్‌ 6 వరకు వేములవాడ, చొప్పదండి, ధర్మపురి నియోజకవర్గాల్లోని అందుబాటులో ఉన్న ఆయకట్టుకు, 119 చెరువులకు సుమారు 3.687 టీఎంసీల నీటిని విడుదల చే సినట్లు తెలిపారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి సా మర్థ్యం 20.175 టీఎంసీలకు గాను ప్రస్తుతం 15 టీ ఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు తెలిపారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌లోని నీటి లభ్యత ఆధారంగా గత ఏడాది డిసెంబర్‌ 14న హైదరాబాద్‌లోని స్టేట్‌ లెవల్‌ కమిటీ ఇరిగేటెడ్‌ వాటర్‌ అథారిటీ మేనేజ్‌మెంట్‌  కమిటీ ద్వారా నీటి విడుదలకు నిర్ణయించినట్లు చెప్పారు. దీనిలో భాగంగా హైదరాబాద్‌ తాగునీటి అవసరాల కోసం 7 టీఎంసీలు, ఎన్టీపీసీకి 2 టీఎంసీలు, గూడెం ఎత్తిపోతల పథకానికి 2 టీఎంసీలు, మిషన్‌ భగీరథకు 1.7 టీఎంసీలు, మంచిర్యాల బెల్లంపల్లి తాగునీటి కోసం 0.3 టీఎంసీలు, కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ-6 ట్రయ న్‌ రన్‌ కోసం 1 టీఎంసీ, అలాగే గోదావరిఖని, రామగుండం మండలాలకు తాగునీటి కోసం 0.5 టీఎంసీలు నీటి కేటాయిచారని తెలిపారు. మొత్తం 14.49 టీఎంసీల నీటిని కేటాయించగా, ఈ నీటి ని 2019 జూలై వరకు సరఫరా చేస్తామన్నారు.