ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోతలు షురూ..
` కాళేశ్వరం ప్రాజెక్టులోని లింక్ `2లో ఎత్తిపోతలు
` శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు
పెద్దపల్లి(జనంసాక్షి): కాళేశ్వరం ప్రాజెక్టులోని లింక్ `2లో ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పరిధిలోని నంది మేడారం పంప్‌హౌస్‌లో అధికారులు మోటార్లు ఆన్ చేశారు. నంది మేడారంలో 4, 6వ మోటార్లను ఆన్ చేసినట్లు అధికారులు తెలిపారు. మరో 3 పంపులు ఆన్ చేసే అవకాశం ఉంది. గాయత్రి పంప్ హౌస్‌కు 6,240 క్యూసెక్కుల నీరు ఎత్తిపోస్తున్నారు. గాయత్రి పంప్‌హౌస్ నుంచి మిడ్ మానేరుకు జలాలు తరలిస్తున్నారు. ఎగువన భారీ వర్షాలు కురవడంతో పాటు ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు పడుతుండడంతో వాగులు, వంకలు ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. కడెం ప్రాజెక్టు, పరివాహక ప్రాంతాల నుంచి భారీగా వరద వస్తోంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 20.17 టిఎంసిలుండగా ప్రస్తుతం నీటి నిల్వ 16.91 టిఎంసిలుగా ఉంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇన్‌ఎª`లో 14,349 క్యూసెక్కులు, ఔట్‌ప్లో 331 క్యూసెక్కులు ఉంది.సంగారెడ్డి జిల్లాలో సింగూరు ప్రాజెక్టులోకి భారీగా వరద ప్రవాహం ప్రవహిస్తోంది. సింగూరు ప్రాజెక్టు నీటి సామర్థ్యం 29.91 టిఎంసిలు ఉండగా నీటి సామర్థ్యం 14.06 టిఎంసిలుగా ఉంది.సింగూరు ప్రాజెక్టు ఇన్‌ఎª`లో 1595, ఔట్‌ఎª`లో 391 క్యూసెక్కులుగా ఉంది.