ఎల్లమ్మ తల్లికి సీఎం కేసీఆర్ పట్టు వస్త్రాల సమర్పణ
బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మ¬త్సవం వైభవంగా జరిగింది. వేద మంత్రోఛ్చరణాల మధ్య ఘనంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. అమ్మవారికి ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు కల్యాణ మ¬త్సవంలో పాల్గొని ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు. కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఇందులో ¬ంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు, డిప్యూ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం దంపతులు ఎల్లమ్మ తల్లికి పట్టువస్త్రాలను, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. ఈ మ¬త్సవాన్ని వీక్షించి అమ్మ కృప పొందేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఎలాంటి ఇబ్బందుల తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. అనంతరం సనత్‌నగర్, కూకట్‌పల్లి పరిధిలోని ఇందిరానగర్‌లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించారు. ఇందిరానగర్‌లో రహదారులు, ఇళ్లను పరిశీలించిన సీఎం బస్తీ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నగరంలోని బస్తీల్లో దాదాపు 2లక్షల కుటుంబాలు నివశిస్తున్నాయని, వీరందరికీ దశలవారీగా రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. ఇందిరానగర్ బస్తీవాసులకు జ్లీపస్-2 పద్ధతిలో ఇళ్లు నిర్మాణం చేపడతామన్నారు. లే అవుట్ నమూనాలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. హెచ్‌పీఎస్ ఎదురుగా ముస్లింలకు కమ్యూనిటీ హాలు నిర్మిస్తామన్నారు. రాష్ట్రమంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, పలువురు అధికారులు పాల్గొన్నారు.