ఎల్లవేళలా అధికారపక్షమే గంటా రాజకీయ లక్ష్యం
వైసిపిలో చేరివుంటే మంత్రి అయ్యే వారేమో
టిడిపితో అంటీముట్టనట్లుగా సాగుతున్న వ్యవహారం
విజయవాడ,ఫిబ్రవరి24(జనం సాక్షి): ఎపిలో తిరిగి అధికారమే లక్ష్యంగా టిడిపి యుద్దం తరహాలో అధికార వైసిపిపై పోరాడుతోంది. వివిధ సమస్యలే కావచ్చు..లేదా నిర్ణయాలు కావచ్చు ప్రభుత్వం తీరుపై మండి పడుతోంది. ఎక్కడిక్కడ నేతలంతా ఏకతాటిపైకి వచ్చి పోరాడుతున్నారు. వైసిపి పాలనను నిలదీస్తున్నారు. ఈ క్రమంలో ఒకప్పుడు టిడిపిలో అధికారం వెలగబెట్టి, మంత్రిపదవిని అనుభవించిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మాత్రం అంటీముట్టనట్లుగా ఉన్నారు. గతంలోనే ఆయన వైసిపిలోని వెళ్లాలని ప్లాన్ వేసుకున్నా ఎందుకనో బెడిసికొట్టింది. దీంతో అటు అధికార పార్టీలోకి వెళ్లేక..ఇక టిడిపిలో ఇమడలేక రాజకీయ దోబూచులాడుతున్నారు. పార్టీలోనే ఉంటానంటున్నా.. హైకమాండ్ పిలిస్తే మాత్రం పలకరు. ఉనికి కోసమే అనుకుంటే.. వ్యూహాలను తెరపైకి తెస్తారు. రెండున్నరేళ్లుగా ఇదే ఆయన అనుసరిస్తున్నారు. దాదాపుగా వైసిపిలో చేరుతారనుకున్న సమయంలో మంత్రి అవంతి శ్రీనివాస్ అడ్డుపుల్ల వేశారని ప్రచారం జరిగింది. మొత్తంగా అధికారం ఉంటే తప్ప నిలబడని రాజకీయ వ్యవహారాన్ని ఆయన అలవర్చుకున్నారు.
వైసిపిలో చేఇవుంటే ఏదో ఒక పదవిని తగించుకుని చురుకుగా తిరిగేవారేమో అని రాజకీయాల్లో చర్చ సాగుతోంది. సుదీర్ఘ అనుభవం ఉన్న కాపు నేతగా గుర్తింపు ఉన్నా..రాజకీయంగా మాత్రం అధికారపక్షంలో ఉండేందుకు ఇష్టపడతారు. అలాగే అధికారంలో ఉన్నా లేకపోయినా ఎప్పుడూ వార్తల్లో నిలిచేందుకు తాపత్రయ పడతారు. రాజకీయాలను తన చుట్టూ తిప్పుకోవాలనే తాపత్రయం ఆయనలో కనిపిస్తుంది. ప్రస్తుతం విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న ఆయన రాజకీయ స్తబ్దత పాటిస్తున్నారు. పార్టీకి, ప్రజలకు పెద్దగా అందుబాటులో ఉండటం లేదు. పార్టీకోసం బహిరంగ వేదికలపైకి వచ్చిన సందర్భం లేదు. వైసిపిలోకి వెళ్లలేక పోయినా టిడిపిలో అయినా రాకీయంగా చురుకుగా ఉండడం లేదు. అలాగే చంద్రబాబుతో సఖ్యత కొనసాగించడం లేదు. దీంతో ఆయన ఎటువైపో తేల్చుకోవడం ప్రజలకు కూడా కొంచెం కష్టంగానే ఉంది. ఈ క్రమంలో చంద్రబాబుతో దూరం పెరిగిందనే భావన ఉంది. అది నిజమే అన్నట్టు ఆయన వైఖరి ఉంటోంది. ఉత్తరాంధ్రలో పార్టీ పటిష్టత, భవిష్యత్ ప్రణాళికల కోసం చంద్రబాబు ఎమ్మెల్యేలతో ముఖాముఖీ సమావేశం అవుతున్నారు. ఆ భేటీ కోసం ఎన్టీఆర్ భవన్ నుంచి గంటాకు పిలుపు వచ్చింది. డేట్.. టైమ్ ఫిక్స్ అయ్యాక ఆఖరి నిముషంలో అధినేతతో భేటీ వాయిదా వేసుకున్నారు. దీనికి ఆయన దగ్గర బలమైన కారణాలు ఏవీ కనిపించలేదు. దీంతో అసలు ఏం జరుగుతుందనే ఉత్సుకత రాజకీయ వర్గాల్లో రేకెత్తింది. మరోవైపు అధినేతతో కనీసం ఫోన్‌లో అయినా చర్చించేందుకు రావడం లేదు. ఉత్తరాంధ్రలో కూడా టిడిపి గట్టిగా పోరాడుతున్నా ఆయన మాత్రం అంటీ ముట్టనట్లుగా ఉన్నారు.
చాలాకాలంగా గంటా శ్రీనివాస్ పక్కపార్టీలవైపు చూస్తున్నారనే ప్రచారం నలుగుతోంది. మొదట్లో వైసీపీలో చేరేందుకు గట్టి ప్రయత్నాలు చేసినా వర్కవుట్ కాలేదు. మంత్రి అవంతి, ఎంపీ విజయసాయిరెడ్డి వంటి వారు బహిరంగ వేదికలపైనే వ్యతిరేకించారు. ఆ తర్వాత టీడీపీలోనే కొనసాగాలని నిర్ణయించుకున్న గంటా.. మధ్యలో కాస్త యాక్టివ్ రోల్ తీసుకునేందుకు ప్రయత్నించారు. తాజాగా అధినేతతో సమావేశానికి గంటా డుమ్మాకొట్టడం వెనక అసలు కారణాలపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల నాటికి జనసేన, తెలుగుదేశం జట్టుకట్టే సంకేతాలు కనిపిస్తున్నాయి. క్షేత్రస్ధాయిలో ఇప్పటికే రెండుపార్టీలు ఒక అవగాహనకు వచ్చేసినట్టే చెబుతున్నారు. ఈ తరుణంలో రాజకీయంగా క్రియాశీలకంగా వ్యవహరించాలనేది గంటా ఆలోచనగా ఉన్నట్లుగా ఉంది.మొత్తంగా రాజకీయంగా లబ్ది కలిగితే తప్ప కదలని స్థితిలో ఇప్పుడు గంటా శ్రీనివాసరావు ఉన్నాడన్న ప్రచరం సాగుతోంది. వైసిపికి పూర్తిగా వ్యతిరేకత వస్తే తప్ప ఆయన