ఎవరెస్ట్ ఎత్తు మరోసారి లెక్కింపు

ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరం ఎవరెస్ట్‌ ఎత్తును మరోసారి కొలవనున్నారు. 2015లో సంభవించిన భూకంపం కారణంగా శిఖరం ఎత్తు తగ్గిందనే అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో తాజా ప్రయత్నాలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కేంద్ర శాస్త్రసాంకేతిక మంత్రిత్వశాఖ, భారత సర్వేక్షణ సంస్థ, నేపాల్‌ ప్రభుత్వం సంయుక్తంగా దీనిని చేపడుతున్నాయి. ప్రస్తుతం ఎవరెస్ట్‌ ఎత్తు సముద్రమట్టానికి 8,848 మీటర్లు ఉంది. జీపీఎస్‌తో పాటు సర్వేక్షణ సంస్థ రూపొందించిన ఇండ్‌జియోయిడ్‌ వెర్షన్‌ 1.0 నమూనాను ఈ కసరత్తులో ఉపయోగించనున్నారు. ప్రపంచంలో ఎత్తైన పర్వతాల్లో ఒకటిగా ఎవరెస్ట్  ను1947లో గుర్తించారు.