ఎసిబి వలలో విఆర్వో
పెద్దపల్లి,సెప్టెంబర్18(జనంసాక్షి): రామగుండం మండలం మేడిపల్లి వీఆర్వో ఎసిబికి చిక్కారు. విఆర్‌వో మహేందర్ రూ.5వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుపడ్డాడు. సతీశ్ అనే వ్యక్తి పాస్‌బుక్‌లో పేరు మార్పిడి కోసం డబ్బులు డిమాండ్ చేసి, తీసుకుంటుండగా అధికారులు మంగళవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పేరు మార్చడం కోసం వీఆర్వో డబ్బులు డిమాండ్ చేయడంతో రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వీఆర్వో కార్యాలయంలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.