ఎస్ఎఫ్ఐ జీపు జాత ముగింపు సభను జయప్రదం చేయండి
-ఎస్ఎఫ్ఐ జహీరాబాద్ ఏరియా కమిటీ
జహీరాబాద్ ఆగస్టు 26( జనంసాక్షి)ఎస్ఎఫ్ఐ జీపు జాత ముగింపు సభను జయప్రదం చేయాలని ఏరియా కార్యదర్శి రాజేష్ పిలుపునిచ్చారు శుక్రవారం ఆయన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యారంగా పరిరక్షణ స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల, హాస్టల్ సమస్యల పరిష్కారానికై జరుగుతున్న ఎస్ఎఫ్ఐ జీపు జాత ముగింపు సభలో విద్యార్థులు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనాలని అన్నారు. ప్రభుత్వం కేజీ టు పీజీ ఉచిత విద్యను అందిస్తామని ప్రగల్బాలు పలికినటువంటి రాష్ట్ర ప్రభుత్వం 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం మెస్ కాస్మెటిక్ చార్జెస్ పెంచకపోవడం చాలా రకాలుగా విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోవడం సిగ్గుచేటు అన్నారు.కావున ఈ నెల 27న జరిగే ఎస్ఎఫ్ఐ
జీపు జాత ముగింపు సభలో పెద్ద సంఖ్యలో విద్యార్థులందరూ పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఏరియా ఉపాధ్యక్షులు దుర్గాప్రసాద్, నాయకులు మల్లేష్, చంద్రవర్దన్, సాయి ,గౌతమ్, అతిక్ పాషా, హరీష్, విష్ణు తదితరులు పాల్గొన్నారు.