ఎస్ఎఫ్ఐ విద్యార్థి పోరు జీపు యాత్ర 

సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు పోరాటం ఆగదు:జిల్లా కార్యదర్శి సాయి కుమార్

కొత్తగూడ జూలై 26 జనంసాక్షి:విద్యారంగ సమస్యల పరిష్కారానికి,సంక్షేమ హాస్టల్ సమస్యల పరిష్కారానికై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈనెల 24న ప్రారంభమైన జీపు యాత్ర 3 రోజు కొత్తగూడ మండలానికి చేరుకోవడం జరిగింది.ఈ సందర్భంగా గుగులోతు సూర్య ప్రకాష్ అధ్యక్షతన జరిగిన అంబేడ్కర్ సెంటర్ మీటింగ్ లో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి,యాత్ర రథ సారధి కేలోతు సాయికుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్య రంగం పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని,పాఠశాలలో ప్రారంభమై నెలలు గడుస్తున్న ఇప్పటివరకు పాఠ్య పుస్తకాలు అందించలేదని అవేదన వ్యక్తం చేశారు.ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలని,అదేవిధంగా కొత్తగూడ మండల కేంద్రంలో కళాశాల నూతన వసతి గృహాన్ని ఏర్పాటు చేయాలని,బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయిందని,నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని అన్నారు.అంతేకాకుండాతక్షణమే బయ్యారం లో పరిశ్రమ ఏర్పాటు చేయాలని,ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా గూగులోతు సూర్య ప్రకాష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం,సంక్షేమ హాస్టల్లో సమస్యలు విపరీతంగా పెరిగిపోయాయి.గడిచిన 10 ఏళ్లలో ఎలాంటి విద్యాభివృద్ధికి నోచుకోలేదని తెలిపారు.దేశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని అన్నారు.ఈ యాత్రలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి సింహాద్రి,జిల్లా బాలికల నాయకురాలు సౌమ్య,మహేశ్వరి,శ్రావణి,భూక్యా రాజేష్,హరిచందర్,అరవింద్,కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు