ఎస్ఎఫ్ఐ 17వ అఖిలభారత మహాసభలను జయప్రదం చేయండి….
కరీంనగర్ టౌన్ నవంబర్ 21(జనం సాక్షి)
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డిసెంబర్ 13 నుండి 16 వరకు తెలంగాణ రాష్ట్రంలో ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే ఎస్ఎఫ్ఐ 17వ అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని తెలంగాణ చౌక్ లో సోమ వారం పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గజ్జెల శ్రీకాంత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి అఖిలభారత మహాసభలు లకు మన హైదరాబాద్ లోని ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియా యూనివర్సిటీ వేదిక కాబోతుంది, దీనిని జయప్రదం చేయాల్సిందిగా విద్యార్థులను మేధావులను కోరారు. ఈ మహాసభకు దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలు, సెంట్రల్ యూనివర్సిటీల నుండి 1500 విద్యార్థి ప్రతినిధులు హాజరు కానున్నారు. ఈ మహాసభలో దేశవ్యాప్తంగా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ అనుసరిస్తున్న విధానాల వలన విద్యలో మతత్వం ,కాషాయకరణ చోప్పించే ప్రయత్నం చేస్తుంది దీనిని ఎస్ఎఫ్ఐ గా పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. నూతన విద్యా విధానం పేరుతోనే విద్యార్థులలో మతోన్మాదాన్ని ప్రేరేపించే విధంగా ఈ నూతన విద్యా విధానం ఉంటుందని అన్నారు. ఇప్పటికే దేశంలో విద్య అనేది రోజురోజుకీ అంగడిలో సరుకుగా మారుతుంది. విద్యలో ప్రైవేటీకరణ , కార్పొరేటీకరణ ప్రభుత్వాలే పెంచి పోషిస్తున్నాయి దీనివలన పేద మధ్యతరగతి కుటుంబాలు ఉన్నతమైన విద్యకు దూరమయ్యే పరిస్థితి కనబడుతుంది, కాబట్టి నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని ఈ మహాసభలలో తీర్మానం చేయబోతున్నామని అన్నారు. దేశంలో నిరుద్యోగత రోజుకు పెరిగిపోతుంది లక్షలాది మంది విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకొని బయటికి వస్తే కనీసం ప్రభుత్వాలు వారికి ఉపాధి అవకాశాలు కల్పించడం లో పూర్తిగా విఫలమైందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి కోటి ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఆచరణలో మాత్రం పూర్తిగా దానిని మరచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అదే విధంగా దేశంలో విదేశీ యూనివర్సిటీ పేద మొదటి విద్యార్థులను చదువులకు దూరం చేసే విధంగా వ్యవహరిస్తుందని అన్నారు. కాబట్టి నూతన విద్యా విధానం రద్దు చేయాలి . విదేశీ యూనివర్సిటీలు భారతదేశంలోకి అనుమతించకూడదు. చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థికి ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈ మహాసభలో తీర్మానం చేయబోతున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో నగర అధ్యక్ష కార్యదర్శులు తిప్పారపు రోహిత్ కాంపెల్లి అరవింద్, జిల్లా కమిటీ నాయకులు సురేష్, ,శివ, నాయకులు ఈషక్,సంతోష్, ఆదిత్య, సంయుక్త, హారిక, రీనా, అక్షిత, సారిక, మనీషా, అంజలి, శ్రీలేఖ, తదితరులు పాల్గొన్నారు.