*ఎస్టి సెల్ మండల అధ్యక్షుడిగా పీర్ల రామకృష్ణ*

*పలిమెల, ఆగస్ట్ 30 (జనంసాక్షి)* పలిమెల మండల కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా పీర్ల రామకృష్ణకు నియామక పత్రం అందించారు. ఏఐసిసి కార్యదర్శి, మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు జిల్లా ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు పోరిక సమ్మయ్య పలిమెల ఎస్టీ మండల అధ్యక్షుడిగా పీర్ల రామకృష్ణను నియమించినట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఈ నియామక పత్రాన్ని మంగళవారం పలిమెల మండల అధ్యక్షుడు గుండెబోయిన చిన్నన్న అందించారు. ఈ సంధర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ తనపై నమ్మకంతో మండల ఎస్టీ సెల్ భాధ్యతలు అప్పగించినందుకు శ్రీధర్ బాబు మరియు పోరిక సమ్మయ్యకు మండల కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని దానికోసం కృషి చేస్తానని, పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాలగొంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి గుండెబోయిన వెంకటస్వామి, బ్లాక్ కాంగ్రెస్ కార్యదర్శి రాంమోహన్ రావు, సీనియర్ నాయకుడు భూపతి దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.