ఎస్సారార్ కళాశాలలో భారీగా ఏర్పాట్లు
కెటిఆర్‌కు స్వాగత సన్నాహాలు
బైక్ ర్యాలీతో స్వాగతించేలా ప్లాన్
కరీంనగర్,మార్చి5(జనంసాక్షి): ఎస్సారార్ కళాశాల మైదానంలో ఈనెల 6న బుధవారం నిర్వహించే కరీంనగర్ పార్లమెంటరీ సన్నాహక సమావేశానికి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సభా వేదికను సిద్ధం చేశారు. పార్టీ జెండా ఆవిష్కరణ, అమరవీరులకు నివాళులర్పించేందు కు వీలుగా మైదానంలో తాత్కాలికంగా ఏర్పాట్లు చేస్తున్నారు.అలాగే టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ¬దాలో మొదటి సారి జిల్లాకు వస్తున్న కేటీఆర్‌కు ఘనస్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు సన్నద్ధం అవుతున్నారు. కాగా నగర శివారులోని ఎన్టీఆర్ చౌరస్తా నుంచి సభా వేదిక వరకు ద్విచక్ర వాహనాల ర్యాలీతో స్వాగతం పలుకనున్నారు. నియోజకవర్గాల వారీగా నాయకులు కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేయడంతో పాటు భోజన వసతి కల్పించనున్నారు. ఏర్పాట్లను పార్టీ జిల్లా నాయకులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 16 ఎంపీ సీట్లను గెలుచుకుంటామని టీఆర్‌ఎస్ జిల్లా ఇన్‌చార్జి బస్వరాజు సారయ్య ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. ఎస్సారార్ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల మైదానంలో నిర్వహించే కరీంనగర్ పార్లమెంటరీ సన్నాహక సమావేశానికి చేస్తున్న ఏర్పాట్లను మరోమారు మ్మెల్యేలు గంగుల కమలాకర్, సుంకె రవిశంకర్‌లతో కలసి పరిశీలించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ¬దాలో జిల్లాకు వస్తున్న కేటీఆర్‌కు ఘన స్వాగతం పలకాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. సమావేశానికి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 3 వేలకుపైగా కార్యకర్తలు తరలివస్తున్నారని తెలిపారు. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, ఆర్‌ఎస్‌ఎస్ ప్రతినిధులు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు తరలిరావాలని కోరారు. కరీంనగర్ పార్లమెంట్ స్థానాన్ని భారీ మెజార్టీతో గెలిపించుకునేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపు నిచ్చారు. పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే ప్రచారం చేయాలన్నారు.