ఎస్సీ,ఎస్టీ చట్టాలను గౌరవించాలి

హైదరాబాద్‌,జూలై26(జ‌నంసాక్షి): దళితులను అణగదొక్కేందుకు, ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఎమ్మార్సీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ విమర్శించారు. ఏ ప్రభుత్వమైనా రాజ్యాంగానికి లోబడి వ్యవహరించాలే తప్ప.. రాజకీయ ఒత్తిళ్లకు తల వంచకూడదని అన్నారు. కేంద్రం తీరుకు నిరసనగా.. అన్ని రాజకీయపార్టీలు, ప్రజా సంఘాలతో ఛలో డిల్లీ కార్యక్రమానికి రూపకల్పన చేశామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని కాపాడుకోవడం సమష్టి బాధ్యత అన్నారు. ఆగస్టులో చేపట్టనున్న చలో ఢిల్లీని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.