ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ సమావేశంలో అపశృతి

కరీంనగర్‌: జిల్లాలో ఏర్పాటు చేసిన ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ సమావేశంలో అపశృతి చోటు చేసుకుంది. మంత్రి శ్రీధర్‌బాబు కూర్చున్న కుర్చీ విరిగిపోయింది. దీంతో శ్రీధర్‌బాబు కిందపడిపోయారు. మంత్రికి గాయాలు కాలేదని సమాచారం.