ఎస్సీ వర్గీకరణకు బీజేపీ మద్దతిచ్చింది
వారిది న్యాయమైన కోరికే అన్న బండి సంజయ్
న్యూఢల్లీి,డిసెంబర్21(జనంసాక్షి): ఎస్సీ వర్గీకరణకు అన్ని విధాలుగా బీజేపీ మద్దతు ఇచ్చిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. మంగళవారం వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా ఢల్లీి జంతర్ మంతర్‌లో ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనలో బండి సంజయ్, మంద కృష్ణ మాదిగ, ఎంపీ సోయం బాపురావు, విఠల్ పాల్గొన్నారు. ఈసందర్భంగా బండి సంజయ్ విూడియాతో మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికీ అభివృద్ధి ఫలాలు అందాలన్నారు. ఎస్సీ వర్గీకరణ న్యాయబద్ధమైన కోరిక అన్నారు.ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ,కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.మంద కృష్ణమాదిగ నేతృత్వంలో అందరికీ న్యాయం జరుగుతుందన్నారు. త్వరలోనే ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటామని, కేంద్రం తప్పకుండా న్యాయం చేస్తుందని బండి సంజయ్ తెలిపారు.