ఎస్సీ వర్గీకరణపై రాజకీయ పార్టీలు మౌనం వీడాలి

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): ఎస్సీ వర్గీకరణపై అన్ని రాజకీయ పార్టీలు మౌనం వీడాలని ఎమ్మార్పీఎస్      మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా ఇన్చార్జ్ యాతాకుల రాజన్న మాదిగ అన్నారు.బుధవారం ఆత్మకూర్ (ఎస్) మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు మేడి కృష్ణ మాదిగ అధ్యక్షతన జరిగిన దీక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఎస్సి రిజర్వేషన్ల వర్గీకరణ కోసం పోరాడుతున్నామన్నారు.ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి బిజెపి ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.గత 28 ఏళ్లుగా దేశంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పోరాటం జరుగుతుంటే, ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన వర్గీకరణ చేస్తామని దాటవేస్తోందని విమర్శించారు.ఇప్పటికైనా అన్ని పార్టీలు పార్లమెంటులో రిజర్వేషన్ల వర్గీకరణ కోసం పోరాడాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు ములకలపల్లి రవి , మండల నాయకులు తిప్పర్తి గంగరాజు, ములకలపల్లి మధు , మిరియాల చిన్ని ,పల్లెల నాగయ్య , కుశనేపల్లి వెంకన్న , యాతాకుల శివ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు