ఎస్బీఐ ఉద్యోగుల సంఘ కార్యాలయం ప్రారంభం
శ్రీకాకుళం, జూలై 26 : శ్రీకాకుళం పట్టణ సమీపంలోని స్థానిక పెద్దపాడు రోడ్డులో గల ఎస్బీఐ ప్రాంతీయ వ్యాపార కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఉద్యోగుల సంఘ కార్యాలయాన్ని ఆయా శాఖలో పని చేస్తున్న ఉద్యోగులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. బ్యాంకు ప్రాంతీయ మేనేజర్ ఆర్.కృష్ణమూర్తి చేతుల మీదుగా ప్రారంభమైన ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్రస్థాయి నాయకులు ప్రభాకర్, జేపీశర్మ, శ్రీనివాస్, సురేష్‌బాబు, జిల్లా శాఖ అధ్యక్షుడు ఆర్.నరేంద్రకుమార్, అధికారుల సంఘం ప్రాంతీయ కార్యదర్శి సి.కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.