ఎస్ ఆర్ శంకరన్ కు ఘన నివాళి…
: నివాళి అర్పిస్తున్న జిల్లా కలెక్టర్ గోపి
వరంగల్ బ్యూరో అక్టోబర్ 7(జనం సాక్షి)
ఎస్సార్ శంకరన్ ఐఏఎస్ 12వ వర్ధంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ బి.గోపి శంకరన్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళ్ళు అర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సార్ శంకరన్ ఐఏఎస్ గారు వారి విధి నిర్వహణలో బాగంగా ఒక్క సంవత్సరంలోనే 12 సంస్కరణలు తీసుకురావడం జరిగిందని, అంతటి గొప్ప ఐఏఎస్ అధికారిని ఈ రోజున స్మరించు కోవడం సంస్కరణలే కారణం అని వారిని ఈ సందర్భంగా గుర్తు చేసారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ శ్రీవత్సవ కోట అదనపు కలెక్టర్ హరి సింగ్ ఆర్డిఓ మహేందర్ జీ డి ఆర్ డి ఓ సంపత్ రావు, సిపిఓ జీవరత్నం, డిటిడిఓ ఎస్.కె జహీరుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.
Attachments area