ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో వినూత్న నిరసన
ఖమ్మం గాంధీచౌక్: హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద వామపక్ష నేతల దీక్షకు మద్దతుగా మంగళవారం ఖమ్మంలో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో వినూత్న నిరసన నిర్వహించారు. జడ్పీ సెంటర్‌లోని అంబేద్కర్ విగ్రహం ముందు కళ్లకు గంతలు కట్టుకుని అర్థ నగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సిద్ధనేని కరుణ కుమారి, జిల్లా నాయకులు లక్షణరావు, నవీన్ కుమార్, పరుశ్‌రామ్, సురేష్ రెడ్డి పాల్గొన్నారు.