ఏఐసీసీ సమావేశాలకు 131 మంది ప్రతినిధులు
హైదరాబాద్: రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఈ నెల 20న జరగనున్న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సదస్సుకు రాష్ట్రం నుంచి 131 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. 18,19 తేదీల్లో జరగనున్న చింతన్ శిబిరంలో ఎనిమిదిమంది ప్రతినిధులు హాజరుకానున్నట్టు తెలిసింది. ఈ వేదికలో రాజకీయ సవాళ్లు, సామాజిక ఆర్థిక సవాళ్ళు, భారత్-ప్రపంచం, పార్టీ సంస్థాగత పటిష్టం అన్న అంశాలపై విడివిడిగా చర్చించనున్నారు.