ఏకశిలా జూనియర్ కళాశాలలో బతుకమ్మ సంబరాలు

 

వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 30(జనం సాక్షి)

 

వరంగల్ నగరంలోని ఏకశిలా జూనియర్ కళాశాలలో జరిగిన బతుకమ్మ సంబరాల్లో తెలంగాణ ఆడపడుచుల విశిష్ట పండుగ అయిన బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం విద్యార్థినిలు రకరకాల పూలతో బతుకమ్మలను పేర్చి సుందరంగా అలంకరించి కళాశాల ఆవరణలో బతుకమ్మ ఆటను ఉయ్యాల పాటలను చప్పటతో సంస్కృతి సంప్రదాయాలతో ఆనందంతో పిల్లల మధ్య ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా  ఏకశిలా విద్యా సంస్థల చైర్మన్ శ్రీ గౌరు తిరుపతి రెడ్డి  మాట్లాడుతూ తెలంగాణ ఆడపడుచుల బతుకమ్మ బతుకును నేర్పించే పండుగగా కొత్తగా ఆడపడుచులను పరిచయం చేస్తూ అతిపెద్ద తెలంగాణ బతుకమ్మ ప్రపంచాన్నే అనేకపులత తయారు చేసిన తెలంగాణ బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్  సుధాకర్ రెడ్డి అధ్యాపక బృందం పాల్గొన్నారు