ఏటీఎంలో రాహుల్‌ గాంధీ

big_438281_1478860976నోట్ల రద్దు విషయంలో ప్రధాని మోదీపై వరుస విమర్శనాస్త్రాలు సంధిస్తోన్న కాంగ్రెస్‌ ఉపాధ్యక్షడు రాహుల్‌ గాంధీ బుధవారం మరోసారి ప్రజల ‘నోటు’ పాట్లను తెలుసుకున్నారు. తన దగ్గరున్న పాత కరెన్సీని మార్చుకునేందుకు గత వారం ఢిల్లీలోని బ్యాంకుకు వెళ్లి సామాన్య ప్రజలతో కలిసి క్యూలైన్లో నిల్చున్న రాహుల్‌ మరోసారి ముంబై వకోలా ప్రాంతంలోని ఏటీఎం వద్దకు వచ్చి ప్రజలను పలకరించారు. ఈ సందర్భంగా పలకరించిన మీడియాతో రాహుల్‌ మాట్లాడారు. ఏటీఎంలు, బ్యాంకుల వద్ద ప్రజల ఇబ్బందులు కొంచెమైనా తగ్గించేలా కనీస వసతులు ఏర్పాటుచేయాలని సీఎం ఫడ్నవిస్‌ ను కోరుతున్నానన్నారు. అంతకుముందు పరునునష్టం కేసులో బీవండి కోర్టుకు హాజరైన రాహుల్‌ గాంధీకి వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్‌ లభించింది. తదుపరి విచారణ జనవరి 28కి వాయిదా పడింది. ‘పెద్ద నోట్ల రద్దు భారీ కుంభకోణం?’ అని రాహుల్‌ కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.